మొదలైన వన”విందు” రాజకీయాలు
– అభ్యర్థులకు కలిసోచ్చిన కార్తీక మాసం
– ప్రచార వేదికలుగా వనభోజనాలు
టీ మీడియా, నవంబర్ 18, అశ్వరావుపేట : హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం ఈసారి అసెంబ్లీ ఎన్నికలవేళ రావడంతో విందు రాజకీయాలకు వేదిక కానుంది ప్రధాన పార్టీ అభ్యర్థులు వారి ప్రచారంలో భాగంగా ఈ వనభోజనాలను వేదిక చేసుకుంటున్నారు. ఈ వనభోజనాలు అన్ని కులాల వారు వారి కులాలతో నిర్వహించుకోవడం సాంప్రదాయం. కొందరు వారి వారి వ్యాపార సంఘాలతో మరికొందరు వారి యూనియన్ లతో కుటుంబ సమేతంగా నిర్వహించుకుంటూ ఉంటారు.ఇదే అదునుగా తీసుకొని కులభోజనాలకు రాజకీయరంగు తో ప్రచారాలకు వేదికలుగా తయారు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ వనభోజనాలలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విందుకు అయ్యే ఖర్చులు కూడా ఆయా పార్టీ అభ్యర్థులే వారే భరించే విధంగా వారి అనుచరులతో వనభోజనాలను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పట్టణంలోని అతిపెద్ద సంఘమైన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణ శివారులో ఓ పామాయిల్ తోటలో 19వ తేదీ ఆదివారం భారీ ఎత్తున వనభోజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
Also Read : మేచ్చా కు బిగుస్తున్న ఓటమి ఉచ్చు
ఈ చాంబర్ ఆఫ్ కామర్స్ లో పట్టణంలో ఉన్న అన్ని వ్యాపార సంఘాలు అనగా వివిధ రకాల సుమారు 22 వ్యాపార సంఘాల వాళ్ళు కలిసి ఒకటిగా ఏర్పడి ఉన్న సమూహమే చాంబర్ ఆఫ్ కామర్స్! ఈ 22 సంఘాలకు కుటుంబ సమేతంగా పిల్లలతో కలిసి సహపంక్తి భోజనాలకు రావలసిందిగా ఆయా సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు ఇప్పటికే సమాచారం అందించారు. ఈ వనభోజనాలకు సుమారు రెండు మూడు వేల మందికి పైనే హాజరవుతారని అంచనా ఈ నిర్వహణ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యయాన్ని అధ్యక్షులు వారే భరిస్తున్నారని సమాచారం. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు అధికార పార్టీ కి మండలంలో ప్రధాన నాయకుడు కావడం,అధికార పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి కావడం ఈయన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చాంబర్ ఆఫ్ కామర్స్ వనభోజనాలకు అప్పధర్మ శాసనసభ్యులు హాజరవుతున్నారు అనడంతో ఆ సంఘంలో గుసగుసలు మొదలయ్యాయి. మరి అభ్యర్థితోపాటు మిగిలిన అభ్యర్థులు ఎవరైనా ఆహ్వానించారా లేదా అనే విషయాన్ని ఎవరు దృవీకరించలేదు. ఇంకెవ్వరూ అయిన వస్తున్నారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
Also Read : రాష్ట్రంలో, జిల్లాలో బీఆర్ఎస్ ప్రభంజనమే
ఈ క్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ లో ఉన్న నాయకులు అన్ని రాజకీయపార్టీలలో కూడా ముఖ్య నాయకులుగా ఉండటం తో ఈ వనభోజనాలు ఏకపక్షంగా ఒక పార్టీకి మద్దతుగా నడుస్తున్నాయని అపోహలు ఉన్నాయి. ఇదిలా ఉండగా కార్తీక మాసంలో జరిగే సంప్రదాయకమైన వనభోజనాలు గానే ముగుస్తాయా లేదా అందరూ అనుకుంటున్నట్టుగానే ఎన్నికలవేళ రాజకీయ పార్టీల ప్రచారానికి వేదికగా కానున్నదా వేచి చూడాలి.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube