గవర్నర్ ప్రసంగినికే దిక్కు లేదు ఎమ్మెల్యేలెంత..?

-ఎమ్మెల్యేఈటల

1
TMedia (Telugu News) :

గవర్నర్ ప్రసంగినికే దిక్కు లేదు ఎమ్మెల్యేలెంత..?

-ఎమ్మెల్యేఈటల

టీ మీడియా, మార్చి 7,హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాల ప్రారంభంపై గన్ పార్క్ వద్ద నల్ల కండువాలతో బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.
40 – 50 ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయాలను సీఎం కేసీఆర్ తుంగలో తొక్కి.. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగానికే దిక్కు లేదని… ఎమ్మెల్యేలు ఎంత?

అని ఈటల వాపోయారు. స్పీకర్ కుర్చీని అడ్డం పెట్టుకొని తాము మాట్లాడకుండా మైకులు కట్ చేయాలని చూస్తున్నారన్నారు. గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా తాము కొద్ది మందిమే ఉన్న సమయంలో గంటల తరబడి మాట్లాడే అవకాశం కల్పించారన్నారు. ఇప్పుడు తామున్నది ముగ్గురమే కావచ్చని కానీ రాబోయే రోజుల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని ఈటల పేర్కొన్నారు. దోపిడీ పాలనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో గళం విప్పుతామన్నారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే బయట పోరాడుతామని ఈటల పేర్కొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube