నిత్యపెళ్లికొడుకు అరెస్ట్‌

మామూలోడు కాదు.

1
TMedia (Telugu News) :

నిత్యపెళ్లికొడుకు అరెస్ట్‌

-మామూలోడు కాదు.

-13 మందిని శారీరకంగా వాడుకొన్నాడు
టి మీడియా,జూలై21,హైద‌రాబాద్: ప్రేమ, పెళ్లి పేరుతో యువతులకు గాలం వేసి.. వారిని మోసం చేస్తున్న నిత్యపెళ్లికొడుకు అడప శివశంకర్‌ బాబును గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్‌ చేశారు. శివశంకర్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో 13 మంది యువతులను పెళ్లిచేసుకున్నట్టు విచారణలో తేలింది. హైదరాబాద్‌, రాచకొండ, సంగారెడ్డి, గుంటూరు, విజయవాడలో పలు సెక్షన్ల కింద పోలీసు స్టేషన్లలో శివశంకర్‌పై కేసులు నమోదయ్యాయి. అయితే, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామానికి చెందిన శివశంకర్‌బాబు(33) మ్యాట్రిమోనీ ద్వారా యువతులను టార్గెట్‌ చేస్తాడు. అనంతరం, వారికి ఏదో రకంగా తన బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకుంటాడు.

Also Read : రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధుల‌పై

ఇలా పెళ్లి చేసుకుని వారిని శారీరకంగా, ఆర్థికంగా మోసం చేసి వారిని వదిలేస్తాడు. తర్వాత మరో మహిళకు గాలం వేసి పెళ్లి చేసుకుంటాడు. ఇలా దాదాపు 13 మంది యువతులను పెళ్లిచేసుకున్నాడు. కాగా, ఇటీవల హైదరాబాద్‌లో ఓ యువతిని పెళ్లిచేసుకున్నాడు. తర్వాత తనకఅమెరికా ఉద్యోగం వచ్చిందని వెంటనే అక్కడికి వెళ్లాలని భార్యను డబ్బుల కోసం వేధించాడు. ఈ క్రమంలో ఆమె.. భర్తకు రూ. 32 లక్షలు ఇచ్చింది. ఆ తర్వాత, శివశంకర్‌ బాబు మళ్లీ అమెరికా ఊసే ఎత్తలేదు. దీంతో, అనుమానం వచ్చిన.. భార్య అతడి గురించి ఆరా తీయగా ఇప్పటికే పెళ్లిళ్లు అయినట్టు గుర్తించింది. అనంతరం పోలీసులను ఆశ్రయించింది.ఈ సందర్భంగా ఓ బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. నిత్యపెళ్లికొడుకు శివశంకర్‌ బాబును అరెస్ట్‌ చేసినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. అతడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది. పరువు పోతుందనే భయంతో చాలా మంది మహిళలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. డబ్బుల కోసమే మహిళలను ట్రాప్ చేసి పెళ్లిళ్లు చేసుకుంటున్నాడు. మహిళల జీవితాలతో ఆడుకుంటున్నాడు అని ఆగ్రహం వ్యక్తం చేశాడు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube