30 ఏళ్లు దాటుతోన్నా పెళ్లికి నో చెబుతున్నారు..
-తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు
లహరి, ఫిబ్రవరి25 కల్చరల్ : జీవితానికి పరిపూర్ణత పెళ్లితోనే వస్తుందని చాలా మంది భావిస్తుంటారు. మరీ ముఖ్యంగా మన భారతీయ సంప్రదాయంలో ఇది ఎక్కువేనని చెప్పాలి. అందుకే లైఫ్‌లో ఇలా సెట్ అయ్యారో లేదో అలా పెళ్లివైపు అడుగులు వేస్తుంటారు పెద్దలు. అయితే ప్రస్తుతం పెళ్లి చేసుకుంటున్న సగటు వయసు.. 30 ఏళ్లు దాటుతోన్నా పెళ్లికి నో చెబుతున్నారు.. తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు.జీవితానికి పరిపూర్ణత పెళ్లితోనే వస్తుందని చాలా మంది భావిస్తుంటారు. మరీ ముఖ్యంగా మన భారతీయ సంప్రదాయంలో ఇది ఎక్కువేనని చెప్పాలి. అందుకే లైఫ్‌లో ఇలా సెట్ అయ్యారో లేదో అలా పెళ్లివైపు అడుగులు వేస్తుంటారు పెద్దలు. అయితే ప్రస్తుతం పెళ్లి చేసుకుంటున్న సగటు వయసు క్రమంగా పెరుగుతోంది. చైనాలో ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉన్నట్లు తాజా సర్వేలో తేలింది. డ్రాగన్ కంట్రీలో 30 ఏండ్లు దాటినా పెండ్లి కానివారి సంఖ్య పెరుగుతోందని తేలింది.నగరాల్లోని యువత ఒంటరి జీవితాన్ని ఎంపిక చేసుకొంటుంటే, గ్రామీణ ప్రాంత యువతను పెళ్లి చేసుకోవడానికి వదువులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని చైనీస్ వెబ్‌సైట్ వీబో పేర్కొంది. ఈ సర్వేలో తేలిన వివరాల ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు దాటిన పురుషులు పెళ్లి ప్రయత్నాలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. చైనీస్ ప్రభుత్వ లెక్కల ప్రకారం 2022 నాటి పెళ్లి కాని పెద్దవారి సంఖ్య 40 కోట్లకు చేరింది. ఇదిలా ఉంటే చైనాలో విడాకుల రేటు కూడా పెరుగుతుండడం గమనార్హం. ఒంటరిగానే జీవించడానికి చాలా మంది యువకులు భావిస్తున్నట్లు సర్వేలో తేలింది.
Also Read : మార్చి 3 నుంచి తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
ఇక చైనాలో జనాభ తగ్గడం కూడా ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. దీంతో డ్రాగన్ కంట్రీ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. 2016లో ఏకైక సంతానం నిబంధనలకు స్వస్తి చెప్పి ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతి ఇచ్చింది. దీనివల్ల కూడా ఆశించిన ఫలితం లేకపోవడంతో 2021లో ముగ్గురు పిల్లలకు అనుమతి ఇచ్చింది. అయినా పెళ్లి అంటే యువత భయపడుతోంది. అయితే ప్రభుత్వం కూడా జనాభా పెరుగుదలకు ముమ్మరంగా చర్యలు చేపడుతోంది. పెళ్లి చేసుకున్న యువతకు 30 రోజులపాటు జీతంతో కూడిన సెలవులు ఇచ్చే విధానాన్ని అమలు చేసింది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube