వ్యక్తికి రూ.వెయ్యి కుటుంబానికి రూ.2 వేలు:జగన్

వ్యక్తికి రూ.వెయ్యి కుటుంబానికి రూ.2 వేలు:జగన్

1
TMedia (Telugu News) :

వ్యక్తికి రూ.వెయ్యి కుటుంబానికి రూ.2 వేలు:జగన్

టి మీడియా,మే11,అమరావతి: ‘అసని’ తుపాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశమని సీఎం జగన్‌ అన్నారు. తుపాను ప్రభావిత కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఆదేశాలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలి.. ఇప్పటికే నిధులిచ్చామని చెప్పారు. తీర ప్రాంతాల్లో అప్రమత్తం అవసరమని తెలిపారు. ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

Also Read : దంపతుల దారుణ హత్య

అవసరమైన చోట సహాయ, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. సహాయ శిబిరాలకు తరలించిన వ్యక్తికి రూ.1000, కుటుంబానికి రూ.2వేలు చొప్పున ఇవ్వండని జగన్‌ అధికారులకు చెప్పారు. సహాయ శిబిరాల్లో మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. జనరేటర్లు, జేసీబీలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube