టీ మీడియా నవంబర్ 26 వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తానని భారత ప్రధానమంత్రి చెప్పడం ఎంతో అమోఘం. అయ్యా ప్రధానమంత్రి గత రెండు సంవత్సరాలుగా యావత్ప్రపంచం కరోన మహమ్మారితో ఇంటికే పరిమితమైతే ఒక రైతు మాత్రమే ఎలాంటి మాస్కులు లేకుండా ఎలాంటి శానిటైజర్ వాడకుండా ఆరునెలలు కష్టపడి మనందరి కడుపుకు అన్నం పెట్టే రైతు బాధ పడకూడదు ఉన్నారు.రైతులు ఎవరైతే ఉన్నారు వాళ్ళు కష్టపడి వ్యవసాయం చేయండి మీ కష్టాలు ఏమున్నా మీ డిమాండ్స్ ఏమన్నా నేనున్నాను మీకు అని రైతులకు భరోసా ఇచ్చారు. రైతులకు మంచి రోజులు రావాలని కోరారు. ఇప్పుడు రైతుల సమస్యలపై తెలంగాణ ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ రైతులకు అవగాహన కలిగిస్తూ ఉన్నాను అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా చట్టాలను రద్దు చేయాలని కోరారు. 750 మంది పైగా రైతులు బలిదానాలు చేసుకున్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు.
వ్యవసాయ చట్టాన్ని ప్రైవేటీకరణ చేస్తే రైతు ఉంటాడా భవిష్యత్తులో రైతులను మ్యూజియంలో చూసే పరిస్థితి ఏర్పడుతుంది అన్నారు. అదిగో పులి, ఇది ఒక సింహం ,అదిగో రైతు అని చూపించే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. విద్యుత్ సంస్కరణలు కూడా ఎత్తివేయాలని కోరారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు కెసిఆర్ మూడు లక్షల ఇస్తాను అనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.ఈ వేళలో తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ 20 నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాడు. విద్యుత్ సంస్కరణలు అమలు అయితే రైతు బీమా రైతు బందు ఉండదు. కాబట్టి విద్యుత్ సంస్కరణలు ఎత్తివేయాలని కోరారు. స్వామినందన్ సిఫారస్ అమలు చేయాలని కోరారు. భారతదేశంలో విద్య వైద్యం విమానయానం నౌకాయానం రైల్వేస్ ఎల్ఐసి బీమా సింగరేణి దుర్మార్గంగా ప్రైవేటీకరణ చేయబోతున్నారు. రైతన్న సినిమా ప్రతి ఒక్కరు ఆదరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పుట్ట ఆంజనేయులు, మండ్ల రాజు, జబ్బర్, కుర్మయ్య, సిపిఎం పార్టీ కార్యకర్తలు కార్మికులు కర్షకులు తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube