ప్రతి నియోజకవర్గంలో ఒక కోచింగ్ సెంటర్

మంత్రి తలసాని

1
TMedia (Telugu News) :

ప్రతి నియోజకవర్గంలో ఒక కోచింగ్ సెంటర్: మంత్రి తలసాని
టి మీడియా,మే 02,హైదరాబాద్: ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ లకు అదనంగా హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల పరిధిలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎంఎల్ఏ ల ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పోటీ పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధులకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్ ల ఏర్పాటు, నిర్వహణ పై హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ లు ఎంఎస్ ప్రభాకర్, స్టీఫెన్ సన్, సురభి వాణిదేవి, ఎంఎల్ఏ లు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సాయన్న, రాజాసింగ్, జాఫర్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ శర్మన్, బిసి వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ అలోక్, డిప్యూటీ డైరెక్టర్ ఆశన్న, ఎస్సీ కార్పోరేషన్ డీడీ రామారావు, మైనారిటీ వెల్ఫేర్ డీడీ ఖాసీం, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ రామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పోటీ పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధులలో అనేక మంది నిరుపేదలు వేలాది రూపాయల ఫీజులు చెల్లించి ప్రైవేట్ కోచింగ్ సెంటర్ లకు వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నారని, వారిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు కోచింగ్ సెంటర్ లను ఏర్పాటు చేసిందని వివరించారు. ఈ కేంద్రాలకు హాజరయ్యే అభ్యర్ధులకు ఒక్కొకరికి నెలకు 5 వేల రూపాయల వరకు ఫుడ్, ట్రాన్స్ పోర్ట్ ఖర్చుల కోసం చెల్లిస్తుందని తెలిపారు.

Also Read : వ‌రంగ‌ల్‌లో రూ.30 కోట్లతో వ్యాపారి పరార్‌..

ఒక్కో బ్యాచ్ కు 100 మంది చొప్పున మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు అనుభవజ్ఞులైన వారితో శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. నియోజకవర్గాలలో బీఃసీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ లో కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసి ఏప్రిల్ 27 వ తేదీ నుండి గ్రూప్ -1 శిక్షణ తరగతులు ప్రారంభించినట్లు జేడీ అలోక్ కుమార్ వివరించారు. అదేవిధంగా ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్దమవుతున్న అభ్యర్ధులకు మే 7 వ తేదీ నుండి శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మైనారిటీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో చార్మినార్ లోని ఉర్దూ మాస్కాన్ హాల్ లో ఏర్పాటు చేసిన సెంటర్ లో మే 6 వ తేదీ నుండి తరగతులు ప్రారంభించనున్నట్లు సంబంధిత అధికారులు వివరించారు. ఎస్సీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నిజాం కళాశాల లో ఏర్పాటు చేసిన సెంటర్ లో ఏప్రిల్ 29 వ తేదీ నుండి శిక్షణ తరగతులు జరుగుతున్నాయని తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube