ప్రతి ఒక్క కార్యకర్తను భాగస్వామ్యుడ్ని చేయాలి

శాసనసభ్యులు సండ్ర, పెద్దిరెడ్డి

0
TMedia (Telugu News) :

ప్రతి ఒక్క కార్యకర్తను భాగస్వామ్యుడ్ని చేయాలి

-శాసనసభ్యులు సండ్ర, పెద్దిరెడ్డి

టీ మీడియా,జనవరి 11, కల్లూరు : ఈనెల 18న ఖమ్మంలో జరగనున్న జాతీయ బిఆర్ఎస్ పార్టీ తొలి బహిరంగ సభకు భారీ జన సమీకరణతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి స్వాగతం పలికి సభను విజయవంతం చేయాలని కల్లూరులో ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. పార్టీ కార్యకర్తగా ప్రతి ఒక్కరు ఖమ్మం బహిరంగ సభ విజయోపేతం చేసే విధంగా కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ప్రతి కార్యకర్తకు ఆహ్వానం అందించి, బహిరంగ సభలో పాత్రులని చేసే విధంగా మండలాల, గ్రామాల బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం పనిచేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు సన్నాహక సమావేశంలో పిలుపునిచ్చారు.

Also Read : సీఎం సభ ఏర్పాట్లు,కలక్టరేట్ పరిశీలించిన మంత్రి,ఎంపిలు,ఏం ఎల్ సి

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిఆర్ఎస్ పరిశీలికులు, నర్సంపేట శాసనసభ్యులు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బహిరంగ సభ విజయవంతం చేయడంలో ప్రతి ఒక్క కార్యకర్తను భాగస్వామి చేయాలన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube