టీకా పై అపోహలు వీడి,ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలి.

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్18,కరకగూడెం:

కరకగూడెం మండలం వ్యాప్తంగా ప్రజలు అపోహలు వీడి కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్య సిబ్బంది లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆటో కార్మికులు,వ్యాపారస్తులు తదితరులు
కరోనా టీకా వేసుకోవాలని ప్రభుత్వ వైద్యాధికారి,ఏఎన్ఎంలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ,ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నారు.గ్రామాల్లో మిగిలిపోయినవారు చెప్పుడు మాటలకు వినకుండా,కరోనా బారిన పడకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ముందుకు వచ్చి ధైర్యంతో ముందస్తూ ఆరోక జాగ్రత్త కోసం కరోనా టీకా వేయించుకోవాలని సూచించారు.
కరోనా టీకా వలన ఎవరికి కూడా
ఎటువంటి ఇబ్బందులుగాని,సమస్యలుగాని ఉండవని వైద్యాధికారి తెలిపారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ విజిటర్ భద్రమ్మ, ఏఎన్ఎం తాటి పద్మ,ఆశలు సరిత,మంగవేణి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube