శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం..

శివస్వాములకు స్పర్శదర్శనం

0
TMedia (Telugu News) :

శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం..

-శివస్వాములకు స్పర్శదర్శనం

లహరి, ఫిబ్రవరి9,శ్రీశైలం : శ్రీశైలంలోమల్లన్న దర్శనానికి పాదయాత్ర మార్గంలో వచ్చే భక్తులు సేద తీరేందుకు పలుచోట్ల చలువ పందిళ్లను ఏర్పాట్లు చేసింది. ఈసారి పాగాలంకరణ వీక్షణకు శివస్వాములను 4 వేల మందిని సాధారణ భక్తులు 4 వేల మందిని అనుమతి ఇస్తామని ఆలయ ఈవో లవన్న చెప్పారు.హిందువుల జరుపుకునే పండగల్లో ముఖ్యమైన పండగ మహా శివరాత్రి. ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 18వ తేదీ శనివారం జరుపుకోనున్నారు. మహా శివరాత్రి రోజున లింగోద్భవం జరిగిందని పురాణాల కథనం.. అంతేకాదు శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజుగా భావించి భక్తులు అత్యంత భక్తిశ్రద్దలతో శివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ  నేపథ్యంలో శైవ క్షేత్రాలు శివరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మల్లన్న, భ్రమరాంబల కల్యాణానికి.. బ్రహ్మోత్సవాలను ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు.శ్రీశైలం దేవస్థానంలో ఫిబ్రవరి 11 నుంచి 21 వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, బ్రహ్మారాంబిక అమ్మవారి దర్శనం కోసం శివదీక్షతో సహా ఎనిమిది లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసిన ఆలయ అధికారులు,

Also Read : ఈ ఆలయాన్ని శివయ్య స్వయంగా నిర్మించుకున్నాడట

నంద్యాల జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. మల్లన్న దర్శనానికి పాదయాత్ర మార్గంలో వచ్చే భక్తులు సేద తీరేందుకు పలుచోట్ల చలువ పందిళ్లను ఏర్పాట్లు చేసింది.ఈసారి పాగాలంకరణ వీక్షణకు శివస్వాములను 4 వేల మందిని సాధారణ భక్తులు 4 వేల మందిని అనుమతి ఇస్తామని ఆలయ ఈవో లవన్న చెప్పారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు దర్శనం కోసం నాలుగు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. చంద్రావతి కల్యాణమండపం వద్ద శివదీక్ష భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్‌ను ఏర్పాటు చేశారు. నిర్ణీత సమయాలలో మాత్రమే స్పర్శ దర్శనం అనుమతించబడుతుంది. ఈనెల 11 నుంచి 15 వరకు ప్రతి రెండు గంటలకు ఒకసారి శివదీక్ష ఇరుముడి భక్తులకు చంద్రావతి కళ్యాణ మండపం నుంచి స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తామని లవన్న చెప్పారు.సర్వ దర్శనం కోసం 14 కంపార్ట్‌మెంట్లు, 200 టిక్కెట్ శీఘ్ర దర్శనం కోసం 8 కంపార్ట్‌మెంట్లు కూడా ఏర్పాటు చేశారు. శివదీక్ష భక్తులు జ్యోతిర్ముడిని సమర్పించవచ్చని, అన్నప్రసాదంతోపాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈఓ తెలిపారు. 11 నుండి 21 వరకు బ్రహ్మోత్సవాలలో శీఘ్రదర్శనం 5 వేల టికెట్స్ అతిశీఘ్రదర్శనం 2 వేల టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని ఈవో చెప్పారు.

Also Read : తిన్న వెంటనే స్నానం చేయకూడదని అంటారు..?

ఈనెల 15 నుండి 21 వరకు భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శించడానికి మాత్రమే అనుమతినిస్తామని తెలిపారు. శివ స్వాములు మాలాధారణ తీసి పాతాళగంగలో వేసి కలుషితం చేస్తున్నారు అలాంటివి చేయొద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు.బ్రహ్మోత్సవాలు జరిగే 11 రోజుల పాటు నల్లమల అటవీ ప్రాంతంలో భారీ వాహనాలను అనుమతించరు. ప్రకాశం, నాగర్‌కర్నూల్‌, భారీ వాహనాలను ఇతర రహదారులపై మళ్లించాలని పోలీసులను కోరారు.నంద్యాల ఎస్పీ రఘువీరా రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలంలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు 10 జోన్‌లు, 40 సెక్టార్‌లుగా విభజించామన్నారు. ఆరోగ్య శాఖ తాత్కాలిక ప్రాతిపదికన బ్రాహ్మణ కొట్కూర్, శ్రీశైలం మధ్య 24 ఆరోగ్య శిబిరాలతో పాటు శ్రీశైలంలో 30 పడకల ఆసుపత్రిని నిర్వహినకు ఏర్పాట్లు చేశారు. పాతాళగంగ, లింగాల గట్టు ప్రాంతాల్లో 240 మంది నిష్ణాతులైన ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నామని.. భక్తులను కృష్ణమ్మ నదిలో పుణ్యస్నానం చేసేందుకు వీలు కల్పిస్తామని ఈఓ ఎస్‌ లవన్న తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube