ఈవివి గుండె పోటుతో మృతి

ఈవివి గుండె పోటుతో మృతి

1
TMedia (Telugu News) :

ఈవివి గుండె పోటుతో మృతి

టి మీడియా,జూన్3,హైదరాబాద్:
ప్రముఖ రచయిత, గోదారి యాసే నా శ్వాస అంటూ గోదావరి జిల్లా యాష భాషలను కాపాడుకునేందుకు అనునిత్యం కృషి చేసే గోదారోళ్ళ కితకితలు ఫేస్ బుక్ గ్రూప్ సృష్టికర్త ఈదల వీర వెంకట సత్యనారాయణ ( ఈవీవీ సత్యనారాయణ ) గుండె పోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. గురువారం సాయంత్రం వరకూ ఆరోగ్యంగానే వున్న ఆయన రాత్రి 11.30 సమయంలో గుండె పోటు రావడంతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆసుపత్రి కి తరలించేందుకు 108 కు కాల్ చేయగా వారు వచ్చి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. బంధువులు, స్నేహితులు, అభిమానుల సందర్శనార్థం మృతదేహాన్ని బొమ్మూరు లోని ఆయన స్వగృహం వద్దే వుంచారు. గోదావరి యాష పై విపరీతమైన మక్కువ కలిగిన ఈయన గోదారోళ్ళ కితకితలు పేరిట ఫేస్ బుక్ గ్రూప్ ఎర్పాటు చేసి ఎక్కడెక్కడ వున్నవారినో ఒకటి చేశారు.

Also Read : క‌మ‌ర్షియ‌ల్‌ గ్యాస్ సిలిండ‌ర్‌పై రూ.135 త‌గ్గింపు

ఆరోగ్య కరమైన హాస్యానికి జీవం పోస్తూ మంచి రచయితగా అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆ తరువాత జరిగిన ఓ ప్రమాదంలో ఓ స్నేహితుణ్ణి కాపాడి సంచలనంగా మారారు. ప్రాణం కాపాడిన ఫేస్బుక్ స్నేహం అంటూ అప్పట్లో వార్తా కథనాలు ప్రసారం కావడంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. అనంతరం కొద్ది రోజులకే గ్రూప్ లక్ష మందిని చేరుకుని ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకుంది. గ్రూప్ పెట్టిన దగ్గర నుండి ఈవీవీ హాస్య కథనాలతో పాటు తన జీవితాన్నే ఆదర్శం గా తీసుకుని మధ్య తరగతి ప్రజల స్థితి గతులపై కట్టి పడేసే కథనాలతో తనలోని ప్రత్యేకతను చాటుకున్నారు. ఇటీవలే సినిమాల్లో సైతం ప్రవేశించి తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. ఈవీవీ మరణ వార్త ఆయన ఫేస్బుక్ మిత్రులతో పాటు యావత్ జిల్లా ప్రజలను తీవ్ర ద్రిగ్బంతికి గురి చేసింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube