ఘనంగా మాజీ ఎమ్మెల్యే వర్ధంతి
టీ మీడియా, మే 24, వనపర్తి బ్యూరో : దివంగత మాజీ ఎమ్మెల్యే జయరాములు 37 వ వర్ధంతి మర్రికుంటలోని పాల కేంద్రం దగ్గర ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జయరాములు కుటుంబ సభ్యులు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి, రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, బంజారా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్, పూలే సమాజ వ్యవస్థాపక అధ్యక్షులు బీట్ బిసి టైమ్స్ అధినేత సెoగం సూర్య రావు, అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ అన్ని పార్టీల అధ్యక్షులు అన్ని కుల సంఘాల నేతలు, ప్రజా సంఘాల నేతలు, కార్మికులు పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు.
Also Read : హైదరాబాద్కు చేరుకున్న సీఎం కేసీఆర్
ఈ సందర్భంగా సభకు అధ్యక్షత వహించిన అఖిల పక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్, ముఖ్య అతిథిగా ముఖ్య అతిథులుగా హాజరైన జాజుల శ్రీనివాస్ గౌడ్, సింగం సూర్యారావు, డాక్టర్ రాజుకుమార్ యాదవ్ లు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్యే వర్ధంతి గాని జయంతి గాని చేయకుండా 37 సంవత్సరాలుగా మరుగున పెట్టి అట్టడుగున అనగాడొక్కుతూ పరిపాలిస్తున్న నేతలకు ఈ వర్ధంతి ఒక చెంప పెట్టు లాంటిదని జయరామ్, అన్ని వర్గాల నాయకుల విగ్రహాలను మేమే పెట్టుకుంటామని ఎవరు అడ్డుపడతారో చూస్తామని జయరాములు జయంతి రోజున ఆయన విగ్రహం పెడతామని 37 సంవత్సరాలుగా మూడు కుటుంబాల సభ్యులే ఎమ్మెల్యేలుగా వెలుగబెడుతూ మిగతా వర్గాలకు బిస్కెట్లు వేస్తూ వేల కోట్ల రూపాయలు వెనక్కి వేస్తూ ప్రజల భూములను గుంజుకుంటూ పాలన చేస్తున్న వీరు జయ రాములుని ఒకసారి చూసి నేర్చుకోవాలని ఆయన తన ఇంట్లో రొట్టెలు కట్టుకొని బేయట కార్యకర్తలకు తినిపిస్తూ కార్యకర్తల బాధలు తీరుస్తూ బలహీన వర్గాలకు చేయూతనిస్తూ పరిపాలన చేశాడని, ఆయన విగ్రహం పెట్టే రోజున రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి రాజీవ్ చౌక్ లో సభ పెడతామని ఆ రోజు ఎవరు అడ్డుకుంటారో చూస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వచ్చిన అన్ని పార్టీల జిల్లా అధ్యక్షులు సింగర్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ, విజయ రాములు సిపిఐ పార్టీ, ఎండి జబ్బార్ సిపిఎం పార్టీ, చిన్న రాములు బిఎస్పి పార్టీ, మోహన్ కుమార్ యాదవ్ జిల్లా యాదవ సంఘం నుండి, శంకర్ నాయక్ మాజీ ఎంపీపీ, తిరుపతయ్య యాదవ్ , చీర్ల జనార్ధన్, అఖిలపక్ష ఐక్య వేదిక సభ్యులు చిరంజీవి, రమేష్, షఫీ, రాజనగరం రమేష్ తదితరులు ప్రసంగించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube