ఒక్కొక్కరికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి

మాజీ మంత్రి జూపల్లి డిమాండ్

1
TMedia (Telugu News) :

ఒక్కొక్కరికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి

మాజీ మంత్రి జూపల్లి డిమాండ్

టీ మీడియా, జూలై 29, వనపర్తి బ్యూరో : కొల్లాపూర్ మండల పరిధిలోని ఎల్లూరు గ్రామ సమీపంలో రేగుమానుగడ్డ దగ్గర పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో జరిగిన సంఘటనలో మృతి చెందిన వలస కూలీల కుటుంబాలకు ఒక్కొక్కరికి సంబంధిత కంపెనీ యాజమాన్యం బాధ్యత వహించి 50 లక్షల రూపాయలు పరిహారం అందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని సంఘటనకు బాద్యులైన కంపెనీ యాజమాన్యం పై కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రిలో మార్చురీ విభాగంలో ఉంచిన మృతుల భౌతిక కాయలను శుక్రవారం పరిశీలించారు.ఈ సందర్భంగా మృతుల బంధువులు తోటి కూలీలతో జూపల్లి గారు మాట్లాడారు సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

 

Also Read : టీటీడీకి చెందిన ప్రతి ఆస్తిని ఉపయోగంలోకి తేవాలి

 

ఈ సంఘటన మొదటిది కాదని గతంలో అనేక మార్లు ఇలాంటి సంఘటనలు జరిగి తీవ్ర గాయాలపాలై మృతి చెందిన సందర్భాలు ఉన్నాయని సంబంధిత కంపెనీ యజమాన్యం నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించడం వల్ల ఇలాంటి సంఘటన పునరావృతం అవుతున్నాయని జూపల్లి తో వారు ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ యజమాన్యం పోలీసు సిబ్బందితో జూపల్లి మాట్లాడారు సుదూర ప్రాంతాల నుంచి బ్రతుకు దెరువు కోసం తమ కుటుంబాలను వదిలి కూలీ పనుల కోసం వచ్చిన వారికి తగిన వసతులు కల్పించి ప్రమాద సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పర్యవేక్షిస్తున్న అధికారులు కంపెనీ యజమాన్యానిధని వారి నిర్లక్ష్యపూరితంగా ఉండటం కారణంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రమాద బాధిత కుటుంబాలకు సహాయం అందించి ఆదుకోవాలని మరోమారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జూపల్లి గారు సూచించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube