ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ పొంగులేటి

ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ పొంగులేటి

1
TMedia (Telugu News) :

ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ పొంగులేటి
టి మీడియా, జూన్ 4,కొత్తగూడెం,పాల్వంచ : టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం కొత్తగూడెం, పాల్వంచ మండలాల్లో పర్యటించారు. నాగారం స్టేజ్ టెంపుల్ ప్రాంతంలో గల గుడిపుడి మోక్ష వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పొంగులేటి పూజలు నిర్వహించారు. నాగారం కాలనీలో ఆంజనేయస్వామి గుడి ప్రతిష్ఠ, పోస్టాఫీస్ కేకేవాసు ప్రాంతంలోని పోచమ్మగుడి ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని పొంగులేటి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు పొంగులేటిని ఘనంగా సత్కారించారు.

Also Read : మాఫియా మట్టితో నిండిన రోడ్లు

పొంగులేటి వెంట జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఊకంటి గోపాలరావు, జాల జనకీ రెడ్డి, ఆళ్ల మురళి, చంద్రుపట్ల శ్రీనివాసరెడ్డి, కొత్వాల శ్రీను, చింతా నాని, బాలినేని నాగేశ్వరరావు, మైపతి రామలింగం, తూము చౌదరి, ఎండి. రజాక్, మైనార్టీ నాయకులు గౌస్, పూనం శ్రీనివాస్, రజాక్, చింత నాగరాజు, ఎర్రంశెట్టి ముత్తయ్య, విజయ్, ఇజ్జగారి రవి గౌడ్, దేవరకొండ ప్రసాద్, భద్రయ్య, జాక్కపల్లి ప్రసాద్ బాబు, ఆవుల మధు, సతీష్, బన్నీ, సత్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube