ఆశీర్వాదలు-పరామర్శలు మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

ఆశీర్వాదలు-పరామర్శలు మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

1
TMedia (Telugu News) :

ఆశీర్వాదలు-పరామర్శలు మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన
టి మీడియా,మే 5, జూలురుపాడు: తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం జూలురుపాడు మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా కంపసాటి వెంకన్న కుమారుని వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నూతన వస్త్రాలను కానుకగా బహుకరించారు. వాగొడ్డు తండాలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు పొంగులేటిని ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన చనుమోలు వెంకటేశ్వర్లు కుమారుడ్ని పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వేమూరి కనకయ్య భార్యను పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు.

Also Read : ఇంటర్మీడియట్ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి

ఈ పర్యటనలో పొంగులేటి వెంట మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, మండల నాయకులు లేళ్ల వెంకట్ రెడ్డి, గుండెపూడి సర్పంచ్ నరసింహారావు, దుద్దుకూరి మధుసూధన్ రావు, దుద్దుకూరి నరసింహారావు, గుగులోతు రాంబాబు, ఖాజ రమేష్, యండపల్లి చిట్టిబాబు, యల్లంకి చిన్న నాగేశ్వరరావు, నర్మినేని పుల్లారావు, బాణోతు లాలు, బాణోతు చిన్న, లకావత్ హేమ్ల, భూక్యా జవహార్, ఎస్. నాగరాజు, పోతురాజు నాగరాజు, సాయిల కృష్ణయ్య, బాణోతు జగన్, బాణోతు వీర్యా, కల్యాణపు నరేష్, శ్రీనివాసరావు, యలమద్దిద్ది కామేశ్వరరావు, వేమూరి కనకయ్య, ఎ.లింగారావు, ఎ. నరసింహారావు, పి. వెంకయ్య, దొండపాటి శ్రీనివాసరావు, జవ్వాది శ్రీనివాసరావు, శిరంశెట్టి భూపతిరావు, రామిశెట్టి నరేందర్, లేళ్ల గోపాల్ రెడ్డి, సభావత్ నరేష్, ధర్మసూత్ రమేష్, మల్లెల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube