మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

భారీ కాన్వాయ్ తో స్వాగతం

1
TMedia (Telugu News) :

మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన
– భారీ కాన్వాయ్ తో స్వాగతం

టి మీడియా, ఎప్రిల్ 29,పినపాక: ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పినపాక లోపర్యటించారు. పర్యటనలో నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. నియోజకవర్గానికి పొంగులేటి విచ్చేసిన సందర్భంగా తొలుత పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు బ్రాహ్మణపల్లి చెక్ పోస్ట్ వద్ద భారీ కాన్వాయ్ తో ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం ఏడూళ్ళ బయ్యారం గ్రామంలోని గంగిరెడ్డి వెంకటరెడ్డి కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స పొంది ఇంటికి తిరిగి వచ్చిన సందర్భంగా అతన్ని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Also Read : తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు

అదేవిధంగా గట్ల బాలరెడ్డి రమణ దంపతుల కుమారుడు నవీన్ రెడ్డి – సాహితీలకు ఇటీవల వివాహాం జరిగింది. ఈ సందర్భంగా కొత్త జంటను వారి ఇంటి వద్దకు వెళ్లి ఆశ్వీరదించారు. నూతన వస్త్రాలను కానుకగా అందజేశారు. అశ్వాపురం మండలం నెల్లిపాక సహకార సంఘం అధ్యక్షులు తుక్కాని మధుసూధన రెడ్డి తల్లి రామ నర్సమ్మ గారి ప్రధమ వర్థంతి మరియు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube