సబ్ స్టేషన్ పనులను పరిశీలించిన మాజీ ఎంపీ సోడే

సబ్ స్టేషన్ పనులను పరిశీలించిన మాజీ ఎంపీ సోడే

1
TMedia (Telugu News) :

సబ్ స్టేషన్ పనులను పరిశీలించిన, మాజీ ఎంపీ సోడే

టి మీడియా,మే 14, చింతూరు:
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం ఎర్రంపేట గ్రామంలో నిర్మాణం లో ఉన్న 220/33 కె. వి.విద్యుత్ సబ్ స్టేషన్ పనులను మాజీ ఎంపీ సోదే రామయ్య, అరకు పార్లమెంట్ తెలుగు యువత అధికార ప్రతినిధి గడేసుల రంజిత్ కుమార్ లు శనివారం పరిశీలించడం జరిగింది. కూనవరం, చింతూరు, వి ఆర్ పురం, ఏటపాక పోలవరం నిర్వాసిత విలీన మండలాలు తెలంగాణ నుండి ఆంద్ర ప్రదేశ్ లో విలీనం చేసిన ఈ నాలుగు మండలాలకు తెలంగాణలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లోని పురుషోత్తపట్నం నుండి విద్యుత్ సరఫరా అవుతుంది. తరుచు పాల్వంచ థర్మల్ పవర్ స్టేషన్ లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నాలుగు విలీన మండలాలు చీకటిమయం అవుతున్నాయి.

Also Read : గుమ్మడి కాయలు మాటున గంజాయి రవాణా

దాని కోసం తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్ర బాబు మోతుగుడెం దగ్గర ఉన్న పోల్లూరు జలవిద్యుత్ కేంద్రం నుండి నేరుగా చింతూరు దగ్గర ఉన్న ఏర్రంపేట వద్ద ఒక సబ్ స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి నాలుగు మండలాలకు కోతలు అంతరాయం లేని నాణ్యమైన జల విద్యుత్ ను విలీన మండలాలు ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో 10 ఏకరాల విస్తీర్ణంలో 30 కోట్ల వ్యయంతో 60 కేవీ సామర్థ్యం కలిగిన ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేసి విలీన మండలాలు ప్రజల కరెంట్ కష్టాలు తీర్చాలని స్థలం మంజూరుకి అటవీ శాఖ నుండి అనుమతి కొరకు కొన్ని ఇబ్బందులు పడిన చివరకు అటవీ శాఖ నుండి తీసుకుని అన్ని అనుమతులు ఇచ్చి ఇక పని మొదలు పెట్టే సమయానికి తెలుగు దేశం పార్టీ ఆదికారాన్ని కోల్పోయి0ది. ఇక వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటివరకు దాదాపు 3 సంవత్సరాలుగా పనులను నత్త నడకన సాగిస్తూ తెలంగాణ నుండి కరెంట్ వస్తున్న ఏదైనా అంతరాయం కలిగితే విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు ఉద్యోగస్తులు అందరు కష్టపడి పనిచేస్తున్నా అధికార వైసిపి పార్టీ స్థానిక ఎమ్మెల్యే MLC ల. ఉదాసీనత వారి, చేతకాని తనం వలన విలీన మండలాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.

Also Read : రాజన్నను దర్శించుకున్న డీజీపీ

తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు ఒక్క రోజు కానీ ఒక్క గంట కానీ ఒక్క నిమిషం కుడా కరెంట్ అంతరాయం లేకుండా చేసి రైతులకు 9గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చి విలీన మండలాలు రైతులను ప్రజలను ఆదుకున్నారని మరి టీడిపి హయాంలో లేని రాని కరెంట్ ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అని ప్రశ్నించారు.అంటే ఇది ముమ్మాటికీ వైసిపి పార్టీ ముఖ్య మంత్రి జగన్ రెడ్డి చేత కాని చవట దద్దమ్మ పరిపాలన వలన ఈ కరెంట్ సమస్యలు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ఎం ఎల్ సి లు నిర్వాసితులను మోసం చేయకుండా త్వరగా సబ్ స్టేషన్ పనులు పూర్తి చేసి నాణ్యమైన విద్యుత్ ను ఈ విలీన మండలాలు ప్రజలకు ఇవ్వాలని అలా చేసే వరకు కరెంట్ కోతలు పెట్టకుండా చేయాలని అలా చేయని పక్షంలో టీడిపి పార్టీ గా పోరాటం చేసి కరెంట్ వచ్చేలా చేస్తామని గడేసుల రంజిత్ కుమార్, సోడే రామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube