మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ వివేక్

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ వివేక్

1
TMedia (Telugu News) :

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ వివేక్
టి మీడియా మార్చి 17 లక్షెట్టిపేట:మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల్ లో ఇటీవల అనారోగ్యంతో మరణించిన తొగరి చిన్న లింగయ్య కుటుంబాన్ని,అతని కుమారుడు మాజీ సర్పంచ్ తొగరి కాంతయ్యను బుధవారం మాజీ ఎంపీ,బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. ఒకప్పటి ఇటిక్యాల్ గ్రామ అభివృద్ధి లో సర్పంచ్ గా ఎనలేని సేవలందించిన కాంతయ్యను సమాజానికి అందించిన మహనీయులు తొగరి చిన్న లింగయ్య అని కొనియాడారు. కుమారుడిని ప్రజా సేవ కోసం చిన్నప్పటి నుంచే ప్రేరేపించిన చిన్న లింగయ్య అందరికీ ఆదర్శనీయమన్నారు.చిన్న లింగయ్య పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మౌనంపాటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు వీరమల్ల హరిగోపాల్,ప్రభాకర్,శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హాస్టల్ సందర్శన

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube