టిడిపి సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ సర్పంచ్

ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకొని ఇండిపెండెంట్ గా నా గ్రామానికి సేవ

1
TMedia (Telugu News) :

టిడిపి సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ సర్పంచ్

-ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకొని ఇండిపెండెంట్ గా నా గ్రామానికి సేవ

టి మీడియా, మే 10,పెనుగంచిప్రోలు:

జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం లోని గుమ్మడిదుర్రు గ్రామంలో టీడీపీలో వర్గ విభేదాలు ఒకసారి గా భగ్గుమన్నాయి. దాంతో మాజీ సర్పంచ్ పొన్నం రంగారావు టిడిపి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నేను పార్టీ గెలుపు కొరకు ఎనలేని కృషి చేశాను. నా ఆస్తులను ధ్వంసం చేసిన, నేను పార్టీ కోసం వెనకడుగు వేయలేదు. కానీ నాకు ప్రతిపక్షంలో ఎలాంటి శత్రువులు లేరు. సొంత పార్టీ నేతలే నన్ను టార్గెట్ గా చేసి, నన్ను మానసికంగా,శారీరకంగా గాయపరిచారు. అయినా నేను పార్టీ కోసం కట్టుబడి పని చేస్తూనే ఉన్నాను. నా గురించి నా సొంత గ్రామం లోనే కాకుండా బయట గ్రామస్థులకు కూడా చెడుగా చెప్పినా సరే నేను ఎట్టిపరిస్థితుల్లోనూ కుంగిపోలేదు. కానీ నిన్న మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య గారు నన్ను పరామర్శించడం కొరకు నా ఇంటికి విచ్చేసారు. నేను జరిగినది చెప్పాను. మాజీ శాసనసభ్యులు వారి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో నాకు ఆశ్చర్యం కలిగించింది. గత 30 సంవత్సరాల నుంచి పార్టీ కొరకు పార్టీ గెలుపు కొరకు ఎనలేని కృషి చేసిన వ్యక్తిని నేను.

 

Also Read : సీసీ కెమెరాలతో నేరాల అదుపు

 

నా మీద ఎన్నో కేసులు పెట్టి నన్ను భయపెట్టాలని చూశారు. అయినా నేను భయపడకుండా పార్టీ కొరకు పార్టీ సిద్ధాంతాల కొరకు పేదల పక్షాన అండగా నిలిచాను. నా మీద సొంత పార్టీ నేతలే అనేక రకాలుగా నన్ను చెడు చేయాలని విష ప్రచారం చేశారు. ఇదంతా జరిగినా,మాజీ శాసనసభ్యులు వారు సానుకూలంగా స్పందించకపోవడంతో, నాకు చాలా బాధాకరం గా అనిపించింది. అందుచేత నేను,నా భార్య నా పిల్లలు అందరం కలిసి టిడిపి సభ్యత్వానికి రాజీనామా చేయడం జరుగుతుంది. అదే విధంగా నేను ఎటువంటి రాజకీయ పార్టీ లోకి వెళ్ళను. ఎన్టీఆర్ గారి బొమ్మ పెట్టుకొని స్వచ్ఛందంగా ఇండిపెండెంట్ గా అభ్యర్ధిగా నిలబడి నా ఈ గ్రామ ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని నేను కచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాను. అదే విధంగా మరికొన్ని రోజుల్లో, నా మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు రంగన్న యూత్, మొక్కుబడిగా రాజీనామా చేసే అవకాశం ఉంది. మేమందరం కూడా రాజీనామా పత్రాన్ని అధిష్ఠానానికి పంపించే దిశగా ఉన్నాము. దయచేసి ఎటువంటి రాజకీయ పార్టీ నేతలు అయినా సరే నన్ను కలవడానికి కానీ నాకు ఫోన్ చేయడానికి గానీ ప్రయత్నించవద్దు. అని మాజీ సర్పంచ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి భార్య పొన్నం లత పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube