దూరవిద్య డిగ్రీ పరీక్షలు వాయిదా

దూరవిద్య డిగ్రీ పరీక్షలు వాయిదా

1
TMedia (Telugu News) :

దూరవిద్య డిగ్రీ పరీక్షలు వాయిదా
టీ మీడియా, మే 17,హైదరాబాద్‌ : ఉస్మానియా యూనివర్సిటీ, మే 16: ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్‌ జి. రాంరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ (పీజీఆర్‌ఆర్‌సీడీఈ) ద్వారా అందించే అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ నగేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.బీ, బీకామ్‌, బీబీఏ తదితర కోర్సుల పరీక్షలను ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించినప్పటికీ, ఈ పరీక్షలను 26వ తేదీ నుంచి నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్‌సైట్‌ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.

also Read : గర్భిణీ స్త్రీ కి రక్తం ఇచ్చి ఆదుకున్న సిరి ఫౌండేషన్ సభ్యుడు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube