ప్రణాళికాచరణతో పరీక్ష్యల్లో అధ్భుత ఫలితాలు
– మోడాల చంద్రశేఖర్
టీ మీడియా, ఫిబ్రవరి 16, వనపర్తి బ్యూరో : సరైన ఆహారం,ఆలోచన,అవగాహన, ప్రణాళికాచరణతో పరీక్షల్లో రాణిస్తారని, వ్యక్తిత్వ వికాస నిపుణులు మోడాల చంద్రశేఖర్ సూచించారు. గురువారం వనపర్తి విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో, వ్యక్తిత్వ వికాస – పరీక్షల సన్నాహ ఉచిత శిక్షణా కార్యక్రమం జరిగింది. రచన టైమ్స్ నేచర్ అండ్ కల్చర్ చేయూత, కౌన్సిలింగ్, శిక్షణాలయం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మోడాల చంద్రశేఖర్ విద్యార్థులకు సూచనలు చేశారు. వ్యక్తిత్వ వికాసం, చదివే విధానం, పరీక్షల గూర్చి ముందస్తు సంసిద్ధం చేసి, వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బావన్నజీ ప్రసంగిస్తూ, చంద్రశేఖర్ చేస్తున్న ఉచిత చేయూత, కౌన్సిలింగ్, శిక్షణా సేవలను విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ కళాశాల ఛైర్మెన్ రాజేశ్వర్ రావ్, లెక్చరర్లు రాజేందర్ రెడ్డి, మల్లికార్జున్ గౌడ్, సుదర్శన్, మూర్తు జావళి, శిఖామణి, నాగయ్య, చిన్నయ్య, రుక్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.