రెచ్చిపోతున్న ఇసుక బకాసురులు , ప్రేక్షక పాత్ర వహిస్తున్న అధికారులు……

0
TMedia (Telugu News) :

శ్రీకాకుళం పట్టణం: నగరంలోని పాత హౌసింగ్ బోర్డు కాలనీలో పొన్నాడ వంతెన వద్ద ఇసుక బండి యజమానులు వంతెన అనుకొని ఉన్న ఇసుకను ఇష్టమొచ్చినట్లు తవ్వుకొని పట్టుకొని పోతున్నారు కనీసం అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడకపోవడం విచారకరం, ఇలాగే ఈ అక్రమంగా ఇసుక తవ్వకం చేపట్టినట్టు అయితే పొన్నాడ వంతెన కూలిపోవడానికి అవకాశం ఉంది. పూర్తిగా నాటు బండి యజమానులు వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు ,ఇప్పటికైనా అధికారులు మేల్కొని పొన్నాడ వంతెన కాపాడాల్సింది గా పొన్నాడ వాసులు కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube