ఆదర్శంగా నిలిచిన ఐఎఎస్

ప్రభుత్వ స్కూల్లో అధికారి పిల్లలు

1
TMedia (Telugu News) :

ఆదర్శంగా నిలిచిన ఐఎఎస్

-ప్రభుత్వ స్కూల్లో అధికారి పిల్లలు

టి మీడియా, జులై6,విజయవాడ:ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులపై ఒక విధమైన ఒపీనియన్ ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సరిగ్గా విద్యాబోధన చేయరని అపోహ ఉంది. అలాగే ప్రభుత్వాస్పత్రుల్లో కూడా వైద్యులు సకాలంలో రారని.. సరైన వైద్యం చేయరంటూ పుకార్లు ఉన్నాయి. అయితే ఈ దుష్ప్రచారాన్ని ఖండించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది. ఇందులోనే భాగంగా పలువరు ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ ఆస్పత్రులలోనే డెలివరి చేయించుకుంటున్నారు. అలాగే ప్రభుత్వాస్పత్రులలోనే శస్త్రచికిత్సలు సైతం చేయించుకుని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా ఐఏఎస్‌ అధికారి, ప్రస్తుత శాప్‌ ఎండీ ప్రభాకర్‌ రెడ్డి తన ఇద్దరు పిల్లలను విజయవాడలోని పడమట జిల్లా పరిషత్‌ పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

 

Also Read : రూ.931.02 కోట్లతో.. జగనన్న విద్యాకానుక

 

రాష్ట్రంలో మంగళవారం నుంచి స్కూల్స్ తెరుచుకుకోవడంతో ఐఏఎస్ అధికారి లక్ష్మీ తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ స్కూల్స్‌కి తీసుకెళ్లి జాయిన్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడం వల్ల తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో జాయిన్‌ చేసినట్లు ఐఏఎస్ అధికారి ప్రభాకర్‌రెడ్డి సతీమణి లక్ష్మీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని.. స్కూల్‌లో వసతులు, క్లాస్‌రూమ్‌లు, ప్లే గ్రౌండ్‌ అన్నీ చాలా బాగున్నాయని కితాబిచ్చారు. ఇకపోతే గతంలో నెల్లూరు జిల్లాలో జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో కూడా ప్రభాకర్ రెడ్డి తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించడం గమనార్హం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube