పోలీస్ అభ్యర్థులకు ఎక్స్గ్రేషియా చెల్లించాలి

పోలీస్ అభ్యర్థులకు ఎక్స్గ్రేషియా చెల్లించాలి

0
TMedia (Telugu News) :

పోలీస్ అభ్యర్థులకు ఎక్స్గ్రేషియా చెల్లించాలి

టీ మీడియా, డిసెంబర్ 18, వనపర్తి బ్యూరో : యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివ సేన రెడ్డి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ప్రభూత్వం పోలీస్ నియామకాలలో అవతవకాలు పై పోలీస్ అభ్యర్థులకు మద్దతుగా యువజన కాంగ్రెస్ అహర్నిశలు కృషి చేస్తోంది. కావున ఇందులో భాగంగా పోలీస్ నియమకాలలో హై కోర్ట్ తీర్పు ప్రకారం మల్టిపుల్ ప్రశ్నలకు 7 మార్కులు కలపి మెయిన్స్ కి అనుమతించాలి. రన్నింగ్ అర్హత పొంది లాంగ్ జంప్లో అనార్హులైనా వారిని కూడా మెయిన్స్ కి అనుమతించాలి. పోలీస్ విభాగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన తప్పుడు నియామకాల వల్ల ఎంతో మంది అభ్యర్థుల జీవితాలు రోడ్డు మీద పడే అవకాశం ఉంది. ఈ తప్పుడు నియామకాల వల్ల అభ్యర్థులలో కొందరు ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది కావున వారి కుటుంబాన్నికి ప్రభుత్వం వెంటనే కోటి రూపాయల ఎక్సగ్రెసియా ప్రకటించాలి.

Also Read : ప్రజలను మోసం చేస్తున్న కాలనీ పెద్ద మనుషులు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ యూత్ కాంగ్రెస్ సెక్రటరి, స్టేట్ యూత్ కాంగ్రెస్ ఇంఛార్జ్ రమేష్ బాబు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధికార ప్రతినిధి విష్ణు వర్దన్ రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాండు సాగర్, అసెంబ్లీ ప్రెసిడెంట్ ఆవుల రమేష్, కొల్లాపూర్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ యండి.వహీద్, టౌన్ ప్రెసిడెంట్ శివయాదవ్,వనపర్తి మండలం రొయ్యల రమేష్, పెబ్బేర్ మండలం అధ్యక్షుడు రాజు, శ్రీరంగాపురం మండలం అధ్యక్షుడు చిన్న గౌడ్, గోపాల్‌పేట మండల అధ్యక్షుడు యాదగిరి, వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి, వనపర్తి అసెంబ్లీ కార్యదర్శి అన్ని మండలాల యువజన అధ్యక్షులు, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube