బరుతెగించిన ప్రవైట్ వైద్యం
-లింగ నిర్ధారణలు,ఆపై ఆభాషన్ లు
-ఆర్ఎంపి ముసుగులో బ్రోకర్లు
ఖమ్మం ల్ బైటపడ్డ బాగోతం
టి మీడియా,జూన్ 29,ఖమ్మం ప్రతినిధి:నగరం లో మరోసారి ప్రవైట్ ఆస్పత్రుల భరితెగింపు బైట పడింది.లేని డాక్టర్ల ను బోర్డులు పై చూపుటము,ఆర్ఎంపి ల ముసుగులో ఉన్న బ్రోకర్లుఆఫర్లు ఇస్తూ కోట్లు గడుస్తున్నారు.కరోనాలో మానవత్వం మరిచి వైద్యం ముసుగులో వ్యాపారం చేసిన వ్యక్తి నగర శివార్లలో 10 కోట్లు తో ఇటీవల ఆస్థులు కొనుగోలు చేసారు.అతని కి బ్రోకర్లు గా వ్యవహరించిన ఆర్ఎంపి ముసుగు వేసుకున్న వారి విషయం చెప్పాల్సిన అవసరం లేదు.అంబులెన్స్ లు మొదలు, అనుమతుల్లేని ల్యాబ్ లు ,ముందు లు షాప్ లు కౌన్టర్లు పేరుతో నిర్వహిస్తూ నిలువు దోపిడీ చేస్తున్న అధికారులు అటువైపు చూడరు. ఇదంతా ఒకటైతే సంపాదన సరిపోక చట్టవ్యతిరేకమైన లింగ నిర్దారణలు చెయ్యడానికి దిగజారారు.ఉన్నతాధికారులు కు పిర్యాదు వెళ్లడం తో వారి ఆదేశాలు మేరకు కదిలిన జిల్లా యంత్రాగం నగరం లోని రిలీఫ్ ఆస్పత్రిని సీజ్ చేశారు.ఎక్కడో జనగాం కు చెందిన ఆమెకు ఖమ్మం లో లింగనిర్ధారణ చేసి, ఆడపిల్ల అని తేల్చి,ఆభాషన్ కి ఉపక్రమించారు.
Also Read : బాంబుల మోతతో బెంబేలు
వివరాలు లోకి వెళితే..
సంపాదించిన నగరంలో రిలీఫ్ ప్రైవేట్ ఆస్పత్రిలో చట్టవ్యతిరేక అబార్షన్ జరుగుతున్నట్లు సమాచారంతో ఖమ్మం జిల్లా జిల్లా వైద్య శాఖ అధికారిని డా. మాలతి, ఆకస్మికంగా ఆసుపత్రి నీ తనిఖీ చేశారు. జనగాం జిల్లా సీతారాంపురం చెందిన ఓ మహిళను ఆర్ఎంపీ డాక్టర్ సహాకారంతో లింగనిర్ధారణ పరీక్షలు చేయించి ఆడపిల్ల అని గుర్తించడంతో భక్త రాందాస్ కళ క్షేత్ర సమీపంలోగల రిలీఫ్ ఆసుపత్రి నందు అబార్షన్ చేసేందుకు సిద్ధం చేశారు. పక్కా సమాచారం అందుకున్న జిల్లా వైద్య శాఖ అధికారి మాలతి తమ బృందం ద్వారా ఆకస్మికంగా తనిఖీ చేసి అబార్షన్ నిలువరించారు. గర్భవతిగా ఉన్న మహిళను వైద్య చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అనుమతులు లేకుండా నడుపుతున్న రిలీఫ్ ఆసుపత్రి సీజ్ చేసినట్లు జిల్లా వైద్య శాఖ అధికారి తెలిపారు. స్కానింగ్ సెంటర్ లో లింగ నిర్ధారణ పరీక్షలు చెయడం చట్ట రీత్యా నేరమని, నిర్ధారించిన స్కానింగ్ సెంటర్ లపై ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube