నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఎగ్జిబిషన్ ను వెంటనే తొలగించాలి

0
TMedia (Telugu News) :

ఏఐఎస్ఎఫ్

టి మీడియా,డిసెంబర్ 27, గోదావరిఖని :

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఎగ్జిబిషన్ ను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రామగుండం కార్పొరేషన్ అధ్యక్ష,కార్యదర్శులు రేణుకుంట్ల ప్రీతం,ఈర్ల రామ్ చందర్ లు సోమవారం డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కరోనా సమయంలో కరోనా ని పరీక్షించే ధర్మల్ స్క్రీనర్,శానిటైజర్, మాస్కూలు,రోజు రోజు సానిటేషన్ చేయాల్సి ఉండగా కనీస జాగ్రత్తలు తీసుకోకుండా,ఎగ్జిబిషన్ యాజమాన్యం ఇష్టానుసారంగా ఎగ్జిబిషన్ నీ నడుపుతుందని అన్నారు.అదేవిధంగా అనుకోకుండా అగ్ని ప్రమాదాలు జరిగితే ఫైర్ సేఫ్టీ,ఇసుక,నీళ్లు,కూడా లేవని ఆయన అన్నారు. పార్కింగ్,ఎంట్రెన్స్ ,తిను బండారాలు,వివిధ రకాల ఆటల పై రెండింతల, మూడింతల రూపాలను దండుకోవడం లో ఉన్న ప్రేమ,ప్రజల ప్రాణాలపై లేదని వారు అన్నారు. ప్రజలకు అత్యవసరమైన టువంటి త్రాగునీరు, మూత్రశాలలు ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు అని వారు అన్నారు.

సంబంధిత అధికారులు వెంటనే ఎగ్జిబిషన్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు గాజుల అవినాష్,జక్కుల సాహిత్, శివ,మహేష్, కృష్ణ, మనోజ్,అజయ్ కుమార్, సాయికుమార్, నవీన్,రేవంత్,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube