ఆలమూరు ఎక్సైజ్ సిఐపై బదిలీ వేటు
– పలువురు కానిస్టేబుల్స్‌పై కూడా
– నాటు సారా అరికట్టడంలో వైఫల్యం
– పోలీసులపై సా”రాజు”లం ఫలితం
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు ఎక్సైజ్ సర్కిల్ వ్యాప్తంగా నాటుసారా అరికట్టడంలో ఘోరంగా విఫలమైన ఆలమూరు ఎక్సైజ్ సిఐ శ్రీధర్ పై బదిలీ వేటు పడనుంది. ఇటీవల గోదావరి నది మధ్యలో సారా తయారీ కేంద్రాలపై దాడి చేసిన ఎక్సైజ్ పోలీసులపై సారా వ్యాపారులు దాడి చేసిన సంగతి తెలిసిందే.ఈ దాడికి సంబంధించిన వీడియోలు మీడియా, సోషల్ మీడియా ద్వారా తెలుగు రాష్ట్రాలలో వైరల్ అయ్యింది. దీనంతటికి కారణం ఎక్సైజ్ సిఐ అసమర్థత వల్లే జరిగిందని అధికారులు గుర్తించారు.
also read:బీఎస్ఎన్ఎల్ నుంచి అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్..
పోలీసులను కొట్టే స్థాయికి వారు ఎదిగారంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది. ఉన్నత స్థాయి అధికారులు కూడా ఈ దాడులపై సీరియస్‌గా ఉన్నారు.అధికార పార్టీకి కూడా అపకీర్తి తెచ్చింది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వ చీప్‌విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖలో సరైన అధికారి ఇక్కడ లేకపోవడం వల్లే ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయని ఉన్నతాధికారుల దర్యాప్తులో తేలింది.
also read:ఫిబ్రవరి 13 న జైల్ బోరో
దీనిపై ఇప్పటికే దాడి చేసిన వారిని పోలీసులు అరెస్టు చేసారు. అయితే శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఎక్సైజ్ సిఐ శ్రీధర్ పై బదిలీ వేటు వేస్తున్నారు. అలాగే సారా తయారీ దారుల నుంచి లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలపై పలువురు కానిస్టేబుల్స్‌ను బదిలీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube