పారిశ్రామికవాడలో పేలిన కెమికల్‌ రియాక్టర్లు

పారిశ్రామికవాడలో పేలిన కెమికల్‌ రియాక్టర్లు

1
TMedia (Telugu News) :

పారిశ్రామికవాడలో పేలిన కెమికల్‌ రియాక్టర్లు

టీ మీడియా,ఆగస్టు22, హైదరాబాద్‌: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం శ్రీధర్‌ బయెటెక్‌ కంపెనీలో పేలుడు సంభవించింది. రసాయన ప్రక్రియలో భాగంగా పరిశ్రమలోని ఐదు రియాక్టర్లు ఒకేసారి పేలిపోయాయి. దీంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.

 

Also Read ; ఉపాధి లేక వలస పోతున్న యువత

పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలముకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube