మిల్లర్ల దోపిడీ అరికట్టాలి, రైతులచే దొంగచాటున అక్రమంగా తరుగు తరువు అగ్రిమెంట్లు క్యాన్సిల్ చెయ్యాలి
టి మీడియా, డిసెంబర్ 7, వెంకటాపురం
తెలంగాణ ములుగు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు, పిఏసిఎస్ ఉపాధ్యక్షులు చిట్టెం ఆదినారాయణ మాట్లాడుతూ అడ్డదారుల్లో అన్నదాతలతో అక్రమంగా అగ్రిమెంట్లు చెల్లవని, ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కైన ధాన్యం సేకరించి రైతులే తరుగు తీసుకోమని అనేలా చిత్రీకరించే దృశ్యం చేస్తున్నారని, గుట్టుగా సంతకాలు పెట్టేలా బెదిరిస్తున్నరని లేదంటే ధాన్యం తొలకం ఖర్చులు బరించెల రైతులపై ఒత్తిడి చేస్తున్నారని, రైతుల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం భద్రాచలం, వాజేడు జాతీయ వారిపై రైతులందరూ సుమారు రెండు గంటలపాటు ధర్నా చేసారు. ధర్నాలో ఆరుగాలం కష్టపడి పండించిన రైతన్న నోట్లో మట్టి కొడుతున్న మిల్లర్లు అని ఆరోపించారు.
ఆయన మాట్లాడుతూ మిల్లర్ల తో ధాన్యం సేకరణ కేంద్రాలు చేతులు కలిపి రైతులతో అక్రమంగా ధాన్యం తరుగుకు సహకరించే విధంగా రైతులతో బెదిరించి, అగ్రిమెంట్ లపై సంతకాలు పెట్టిస్తున్నారని, ముందుగానే అగ్రిమెంట్ లపై రైతు చేతులతో రైతే తరుగుకు ఒప్పుకునే విధంగా అగ్రిమెంట్ తయారుచేసి రైతులను బెదిరించి సంతకాలు పెట్టిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల రైతు ఆత్మ హత్యలు పెరుగుతున్నాయని, వరి వేస్తే ఉరి అనే విధంగా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని, ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై రైతును ఏడిపిస్తుందని, రైతు కంట కన్నీరు తెచ్చిన.
ఈ ప్రభుత్వం రానున్న రోజుల్లో రైతులు బుద్ధి చెప్తారన్నారు. వ్యవసాయం చేసే రైతులని దొంగల అమ్మెలా చేస్తున్నారని, మిల్లర్లతో రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు కుమ్మక్కై రైతులు లేకుండా, రానున్న రోజుల్లో వ్యవసాయం అంటే భయపడేలా చేసే ప్రయత్నం చేస్తున్నారని రైతులకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేశారు. ధర్నా, రాస్తారోకోలో చిడెం సాంబశివరావు, తోట మల్లయ్య, సతీష్, అప్పాల్ సత్యం, సర్వేశర రావు, గుండ్రటి సతీష్, నానాజీ, కృష్ణ పాల్గొన్నారు.
దీనిపై స్పందించిన పోలీసు యంత్రాంగం ఎంత చెప్పినా రైతులు విననప్పటికీ పోలీసు శాఖ తహసీల్దార్‌కి వివరించారు. అనంతరం తహశీల్దారు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన రైతులందరూ ససేమిరా అనడంతో తాసిల్దార్ జిల్లా ములుగు జిల్లా డి సి వో చరవాణిలో సమస్యలు వివరించగా రేపు వచ్చి ప్రత్యక్షంగా సమస్యలు నివృత్తి చేస్తానని హామీ ఇవ్వగా రైతులు రాస్తారోకో విరమించారు.
