ఫ్యాష‌న్ షో వేదిక వ‌ద్ద భారీ పేలుడు

ఫ్యాష‌న్ షో వేదిక వ‌ద్ద భారీ పేలుడు

0
TMedia (Telugu News) :

ఫ్యాష‌న్ షో వేదిక వ‌ద్ద భారీ పేలుడు

టీ మీడియా, ఫిబ్రవరి 4, ఇంపాల్‌ : మ‌ణిపూర్ రాజ‌ధాని ఇంపాల్‌లో ఆదివారం బాలీవుడ్ న‌టి స‌న్నీ లియోన్ ఫ్యాష‌న్ షో నిర్వ‌హించాల్సి ఉంది. అయితే ఆ షో వేదిక వ‌ద్ద ఇవాళ ఉద‌యం భారీ పేలుడు జ‌రిగింది. తెల్ల‌వారుజామున 6.30 నిమిషాల‌కు వేదిక‌కు సుమారు వంద మీట‌ర్ల దూరంలో పేలుడు సంభ‌వించింది. ఆ పేలుడు వ‌ల్ల ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేద‌ని తెలిసింది. హ‌ట్టా కంజిబుంగ్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అయితే ఆ పేలుడుకు కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు. ఐఈడీ లేక గ్రానైడ్ వ‌ల్ల ఆ పేలుడు సంభ‌వించిందా అన్న విష‌యం తేలాల్సి ఉంది. పేలుడుకు బాధ్య‌త వ‌హిస్తూ ఇప్ప‌టి వ‌ర‌కు మిలిటెంట్ సంస్థ‌లు ప్ర‌క‌టించ‌లేదు.

Also Read : జిమ్నాస్ట్ దీపా క‌ర్మాక‌ర్‌పై 21 నెల‌ల నిషేధం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube