ఎడ్యుకేష‌న్ సెంట‌ర్ వ‌ద్ద పేలుడు.

19 మంది మృతి

1
TMedia (Telugu News) :

డ్యుకేష‌న్ సెంట‌ర్ వ‌ద్ద పేలుడు..                                                                                                           

టీమీడియా,సెప్టెంబర్ 30, కాబూల్‌: ఆఫ్ఘ‌నిస్తాన్ రాజ‌ధాని కాబూల్‌లో ఇవాళ పేలుడు సంభ‌వించింది. ఎడ్యుకేష‌న్ సెంట‌ర్ వ‌ద్ద జ‌రిగిన పేలుడులో 19 మంది మ‌ర‌ణించారు. అనేక మంది గాయ‌ప‌డ్డారు. ద‌స్తే బార్చి ఏరియాలోని కాజ్ ఎడ్యుకేష‌న్ సెంట‌ర్ వ‌ద్ద పేలుడు జ‌రిగింది.

Also Read : డిస్కౌంట్‌ తగ్గించిన ఎయిర్‌ ఇండియా

యూనివ‌ర్సిటీ ప‌రీక్ష రాస్తున్న విద్యార్థుల‌ను సూసైడ్ బాంబ‌ర్‌ టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. హ‌జారా మైనార్టీ వ‌ర్గానికి చెందిన వాళ్లే ఆ స్ట‌డీ సెంట‌ర్ వ‌ద్ద ఎక్కువ సంఖ్య‌లో ఉన్న‌ట్లు భావిస్తున్నారు. గ‌తంలోనూ ఆ వ‌ర్గంపై దాడులు జ‌రిగాయి. అయితే ప్ర‌స్తుత దాడికి బాధ్య‌త ఎవ‌రూ ప్ర‌క‌టించుకోలేదు. దాడి జ‌రిగ‌న స‌మ‌యంలో విద్యార్థులు ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర‌వుతున్న‌ట్లు తెలిసింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube