బెల్లంపల్లి లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలుపుదల చేయాలి

బెల్లంపల్లి లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలుపుదల చేయాలి

1
TMedia (Telugu News) :

బెల్లంపల్లి లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలుపుదల చేయాలి

టీ మీడియా అక్టోబర్ 12 బెల్లంపల్లి
రైల్వేస్టేషన్ లో దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ , జి.టి ఎక్స్‌ప్రెస్,
రాయ్ పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళను నిలపాలని బెల్లంపల్లి నియోజికవార్గ ఇంఛార్జి కోయ్యల ఎమాజీ అధ్వర్యంలో అదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావుకు ఈ రోజు వినతిపత్రం అందజేశారు.
గతంలో ఈ రైళ్ళను బెల్లంపల్లి స్టేషన్లో నిలిపెవారని అన్నారు . కరోనా ప్రారంభం అయిన తరువాత ఈ రైళ్ళను బెల్లంపల్లి లో నిలపడం లేదని తెలిపారు.బెల్లంపల్లి లో సింగరేణిలో ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ లో సుదూర ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు పని చేస్తున్నారని అన్నారు .రైళ్ళను ఇక్కడ నిలపకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని సోయం బాపురావు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి ఆయన స్పందిస్తూ. దక్షిణా మధ్య రైల్వే జనరల్ మేనేజర్ తో చర్చించి రైళ్ళను నిలిపెలాగ చర్యలు తీసుకుంట అని హామీ ఇచ్చారు.ఈ కార్యకరమంలో జిల్లా ఉపాధ్యక్షులు పులుగం తిరుపతి.జిల్లా కార్యదర్శి గోవర్ధన్,బెల్లంపల్లి బీజేపీ కౌన్సిలర్,అసెంబ్లీ కో కన్వీనర్ అనిత రాజులాల్ యాదవ్, నాయకులు శనిగారపు శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు

 

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube