చంద్రబాబు కస్టడీని పొడిగించండి : సీఐడీ
టీ మీడియా, అక్టోబర్ 5, విజయవాడ : స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్ల మీద గురువారం ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ నేటితో ముగుస్తున్న తరుణంలో కోర్టు ఆదేశాలు కీలకం కానున్నాయి. వర్చువల్ విధానంలో చంద్రబాబుని ఏసీబీ జడ్జి ముందు ప్రవేశపెట్టగా, చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని కోరుతూ సీఐడీ పిటిషన్ వేసింది. కాగా, సాంకేతికంగా చూసిన ఈ కేసులో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని ప్రమోద్ కుమార్ ధూపే పేర్కొన్నారు. ఒప్పందాలలో ఎలాంటి తప్పిదాలు జరగలేదని తెలిపారు. జరిగినా వాటితో చంద్రబాబుకు సంబంధం లేదని వెల్లడించారు. నాటి ప్రభుత్వం స్కిల్ కార్పొరేషన్ ఇచ్చిన బ్యాంకు గ్యారంటీల సంగతేంటని ఏసిబి ప్రశ్నించింది. స్కిల్ కేసులో నిధులు మళ్లింపుపై ఏసీబీ కోర్టుకు ఎఐజి పొన్నవోలు కొన్ని డాక్యుమెంట్లు సమర్పించారు. స్కిల్ డెవలప్మెంట్ నిధులు 27 కోట్లు మళ్ళినట్లు ఆయన తెలిపారు. టిడిపి బ్యాంక్ ఖాతా వివరాలను ఎసిబి కోర్టుకు అందజేశారు.
Also Read : మృతుల కుటుంబాలకు భరోసా
దీనికి సంబంధించిన టిడిపి ఆడిటర్ను ప్రశ్నిస్తామని ఏఏజీ తెలిపారు. ఈ నెల 10న విచారణకు ఆడిటర్ హాజరు కానున్నారని తెలిపారు. కొన్ని బ్యాంకు లావాదేవీలపై చంద్రబాబును ఇంకా విచారించాల్సి ఉందని ఆయన కోరారు. ప్రివెన్స్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ చంద్రబాబుకు అప్లై అవుతుందని ఆయన తెలిపారు. మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు చంద్రబాబును విచారించాల్సిందని పొన్నవోలు కోర్టుకు తెలిపారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube