విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి

విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి

0
TMedia (Telugu News) :

 

కార్పొరేట్ విద్యాసంస్థల దిష్టిబొమ్మ దగ్ధం 

టీ మీడియా,జూన్ 01,గోదావరిఖని: పారిశ్రామిక ప్రాంతంలోని లెనిన్ నగర్ సర్కిల్ లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల్లో ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థిక దోపిడికి గురి చేస్తున్నారని తక్షణమే ఇలాంటి చర్యలు చేపడుతున్న కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఏడేండ్లు గడిచినా కూడా ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నదని ప్రభుత్వమని ఆయన అన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోని ఎడల ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు న్యాతరి పవన్,గాజుల వినయ్, వినయ్ బాబు, గొడిసెల ప్రణీత్, కలికోట ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube