కంటి వెలుగు ను ప్రజలందరూ ఉపయోగిం చుకోవాలి
టీ మీడియా, జనవరి 27, వనపర్తి బ్యూరో : వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదో వార్డులో గల శ్రీనివాసపురంలో కంటి వెలుగు క్యాంప్ కార్యక్రమాన్ని వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, స్థానిక కౌన్సిలర్ విభూది నారాయణ, రైతు సంఘం అధ్యక్షుడు నరసింహ, తిరుమల మహేష్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని చూపులు మందగించకుండా జాగ్రత్త పడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో వేలాదిమంది యువకుల నుంచి మొదలుకొని ముసలివారి వరకు పరీక్షలు చేయించుకుంటున్నారని పరీక్షలు చేయించుకున్న ప్రతి వారిలో ఏదో ఒక చిన్న లోపం కనబడుతుందని దీన్ని బట్టి ముఖ్యమంత్రి దురదృష్టి ఎంత గొప్పదో అర్థమవుతుందని అన్నారు.
Also Read : మూడో భార్యతో ప్రాణహాని ఉంది: నరేష్
ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కంటి వెలుగు అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి స్థానిక వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి వనపర్తి నియోజకవర్గం ప్రజల తరఫున మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ విభూది నారాయణ, రైతు సంఘం మండల అధ్యక్షులు దేవర్ల నరసింహ, టిఆర్ఎస్ నాయకులు తిరుమల మహేష్ బాబు నాయక్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube