సిరియాపై క్షిపణులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌

ఐదుగురు సైనికులు మృతి

1
TMedia (Telugu News) :

సిరియాపై క్షిపణులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌

– ఐదుగురు సైనికులు మృతి

టీ మీడియా, సెప్టెంబర్ 17,డమాస్కస్‌: సిరియాపై ఇజ్రాయెల్‌ మరోసారి విరుచుకుపడింది. రాజధాని డమాస్కస్‌పై క్షపణుల వర్షం కురిపించింది. దీంతో ఐదుగురు సైనికులు మృతిచెందారు. డమాస్కస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, రాజధానికి దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ బాంబులతో దాడులు చేసిందని సిరియా రక్షణ శాఖ తెలిపింది. మరికొన్ని క్షిపణులను నిర్వీర్యం చేశామని ప్రకటించింది.

Also Read : ఆర్థిక పరిస్థితిపై సీఎం చెప్పినవి అన్ని అసత్యాలే

అయితే విమానాశ్రయంపై దాడి నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌ కార్యకలాపాలు యధావిధంగా కొనసాగుతున్నాయని వెల్లడించింది. సిరియాకు ఆకాశ మార్గం ద్వారా లిబియా ఆయుధాలను సరఫరా చేస్తున్నది. దీంతో ఇజ్రాయెల్‌ తరచూ సిరియాలోని విమానాశ్రయాలపై దాడులు జరుపుతున్నది. 2011 నుంచి సిరియాలో అంతర్యుద్ధం కొనసాగుతున్నది. దీంతో ఇప్పటివరకు లక్షల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube