కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు

-విద్యార్థులు ఇష్టపడి చదవాలి

2
TMedia (Telugu News) :

కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు

-విద్యార్థులు ఇష్టపడి చదవాలి

టి మీడియా, జూన్ 13,కాగజ్ నగర్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డి.లక్ష్మి నరసింహం

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం పూర్తి చేసుకున్న కళాశాల డిగ్రీ విద్యార్థులకు డిగ్రీ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సోమవారం వీడ్కోలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డి.లక్ష్మినరసింహం మాట్లాడుతూ డిగ్రీ తరువాత విద్యార్థులు తమ లక్ష్యసాధన కోసం ప్రణాళిక బద్దంగా కృషి చేసి ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకొని రావాలని సూచించారు.

Also Read : హైదరాబాద్ యువతి మిస్సింగ్.

 

ఈ సందర్భంగా కళాశాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు .అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు చూపారులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమం లో అధ్యాపకులు రాజు,రాజేశ్వర్, జనార్ధన్, దత్తాత్రేయ, క్రిష్ణవేణి,పూర్ణిమ శారద,రోజ్ మేరి, కావ్య,సుస్మిత, రాజశేఖర్, దుర్గం, శ్రీనివాస్, వేంకటేశం, జాడి,ప్రేమ్, కృష్ణ,తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube