నకిలీ బాబా ఫోన్ ఓపెన్ చేస్తే మొత్తం అవే

-పూజల పేరుతో మహిళలను వివస్త్రను చేసి ఫోటోలు, వీడియోలు

1
TMedia (Telugu News) :

నకిలీ బాబా ఫోన్ ఓపెన్ చేస్తే మొత్తం అవే

-పూజల పేరుతో మహిళలను వివస్త్రను చేసి ఫోటోలు, వీడియోలు

-బాధితలను బ్లాక్ మెయిల్

టీ మీడియా, డిసెంబర్ 5,హైదరాబాద్ :  చాంద్రాయణగుట్టలో నకిలీ బాబా బాగోతం బట్టబయలైంది. మంత్రాలతో సమస్యలు తీరుస్తానంటూ మహిళ నగ్నఫోటోలు, వీడియోలు సేకరించిన బాబాను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకులోని బీదర్‌ బసవకళ్యాణ్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ హుస్సేన్‌ లారీ డ్రైవర్‌గా పని చేసేవాడు. నకిలీ బాబా అవతారం ఎత్తిన ఇతగాడు.. కర్ణాటక నుంచి పాతబస్తీకి మకాం మార్చాడు. గుల్బర్గాకు చెందిన గులాం అనే మరో వ్యక్తితో కలిసి దందా సాగిస్తున్నాడు.ఇండియా ఫేవరెట్ స్మార్ట్‌ఫోన్ డెస్టినేషన్ | అమెజాన్‌లో బడ్జెట్, మిడ్-రేంజ్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై భలే తగ్గింపు ధరలుబార్కస్‌లో భూతవైద్యుడిగా అవతారం ఎత్తిన హుస్సేన్.. నిరుపేద మహిళలను టార్గెట్‌గా చేసుకొని మోసాలకు తెరిలేపాడు. కష్టాలు తీరుస్తానంటూ మహిళలను మాయమాటలతో బురిడీ కొట్టించాడు. తన గురువు (గులాం) ఇంకా శక్తిమంతుడని.. చేతబడిలో ఆరితేరిన భూతవైద్యుడని ఇక్కడి మహిళలను నమ్మించాడు. తాను చెప్పినట్లు వింటే మీ సమస్యలు తీరిపోవటంతో పాటు కనకవర్షం కురుస్తుందని వారికి మాయమాటలు చెప్పి.

Also Read : ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ తెలంగాణకు వస్తున్నారు

గదిలోకి తీసుకెళ్లేవాడు. బట్టలు లేకుండా పూజలు చేయాలని వారిని వివస్త్రను చేసేవాడు. ఈ క్రమంలో వారి అశ్లీల ఫోటోలు, వీడియోలు తీసుకుని గుల్బర్గాలోని గులాంకు పంపేవాడు.ఆ తర్వాత ఈ కేటుగాళ్లు అసలు రంగు బయటపెట్టేవారు. బాధిత మహిళలకు ఫోన్ చేసి.. మీ నగ్న చిత్రాలు, వీడియోలు తమ వద్ద ఉన్నాయని.., అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటి బయటపెడతామని బెదిరించేవారు. దీంతో పరువు పోతోందని భావించిన ఆ మహిళలు బయటకు చెప్పుకోలేక.. అతడికి డబ్బు ఇస్తూ, భయాందోళనల మధ్య జీవితాలు గడిపేవారు. రోజూ ఓ కొత్త మహిళను టార్గెట్‌ చేసే ఏజెంట్లు, వారి ద్వారా దందా నడిపే వారు. ఈ క్రమంలోనే ఓ బాధిత మహిళ.. ఓ మహిళా సామాజిక కార్యకర్తను కలిసి తన గోడును వెళ్లబోసుకుందిసదరు మహిళా సామాజిక కార్యకర్త పోలీసులకు సమాచారం ఇవ్వగా.. నకిలీ బాబాను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి పక్కా స్కెచ్ వేశారు. మహిళ సామాజిక కార్యకర్తతో పాటు మరో మహిళను పోలీసులు సయ్యద్‌ హుస్సేన్‌ దగ్గరికి పంపారు. నకిలీ మాంత్రికుడి మాయ మాటలు నమ్మినట్టు వారు నటించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేయాలని వారిని గదిలోకి తీసుకెళ్లగానే అప్పటికే మాటు వేసిన పోలీసులు సయ్యద్‌ హుస్సేన్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతానికి సయ్యద్‌ హుస్సేన్‌ను ఒక్కడినే అదుపులోకి తీసుకున్నప్పటికీ ఈ కేసులో ఇంకా చాలామంది ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. సదరు బాబా ఫోన్‌లో దాదాపు 500 పైగా మహిళల నగ్న ఫోటోలు, వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube