ఒక్కో సర్టిఫికెట్‌కు 30 వేల నుంచి 40 వేలు

నకిలీ విద్యా ధ్రువీకరణ పత్రాల ముఠా అరెస్ట్

2
TMedia (Telugu News) :

ఒక్కో సర్టిఫికెట్‌కు 30 వేల నుంచి 40 వేలు

నకిలీ విద్యా ధ్రువీకరణ పత్రాల ముఠా అరెస్ట్

టి మీడియా,జులై5,హైదరాబాద్‌:నకిలీ విద్యా ధ్రువీకరణ పత్రాలను ఇస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్టు రాచకొండ సీపీ మహేష్ భగవత్తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ)తో పాటు కర్ణాటక యూనివర్సిటీల సర్టిఫికెట్‌ను ఈ ముఠా ఇష్యూ చేస్తున్నారని తెలిపారు. చైతన్య పూరి పోలీస్ స్టేషన్లో దీనిపై కేసు నమోదైందన్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రదారి రోహిత్ కుమార్‌తో పాటు మరో ముగ్గురుని అరెస్ట్ చేశామని మహేష్ భగవత్ వెల్లడించారు. కాకతీయ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీల సర్టిఫికెట్స్‌ను ఇష్యూ చేస్తున్నారని సీపీ తెలిపారు.

 

Also Read : మసాజ్‌ చేయమని బెదిరించేవారు.

రోహిత్ అనే వ్యక్తి ఐటి ఉద్యోగి అని… ఫేక్ సర్టిఫికెట్స్‌ను తయారు చేసి డబ్బులు దండుకుంటున్నాడని వెల్లడించారు. శ్రీలక్ష్మి కన్సల్టెంట్స్ ద్వారా ఈ దందా కొనసాగిస్తున్నారన్నారు. ఒక్కో సర్టిఫికెట్‌కు 30 వేల నుంచి 40 వేలు తీసుకుంటున్నారన్నారు. లేని కాలేజీ పేర్లు కూడా పెట్టి సర్టిఫికెట్స్ ఇష్యూ చేస్తున్నారన్నారు. విదేశాలకు వెళ్లే వారు ఎక్కువగా ఈ సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారని వెల్లడించారు. ఇప్పటి వరకూ 20 వరకు సర్టిఫికెట్స్ ఇచ్చినట్టు తెలిసిందన్నారు. గత ఆరు నెలల నుంచి ఈ దందా చేస్తున్నారన్నారు. నిందితుల వద్ద నుంచి నకిలీ సర్టిఫికెట్స్, ల్యాప్ టాప్స్, ప్రింటర్స్, మొబైల్స్ సీజ్ చేశామని మహేష్ భగవత్ వెల్లడించారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube