నకిలీ డ్రగ్స్ డాన్ సతీష్ రెడ్ది

- 2015 నుండి దందాలు

0
TMedia (Telugu News) :

నకిలీ డ్రగ్స్ డాన్ సతీష్ రెడ్ది

– 2015 నుండి దందాలు

– ల్యాబ్ లోనూ గోల్ మాల్

– ఏయిడ్స్, క్యాన్సర్ అభివృద్ధి నిరోధక మందులంటూ ప్రచారం

– ఇండియా మార్ట్ లోనూ తప్పుడు సమాచారం నమోదు

– ఖమ్మం తో పాటు తెలుగు రాష్ట్రాల్లో బలమైన నెట్వర్క్

టి మీడియా, డిసెంబర్ 27, ఖమ్మం బ్యూరో : ఈ నెల 22 న ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం లో నకిలీ డ్రగ్స్ తయారు చేస్తూ అధికారులకు పట్టుబడ్డ కడారి సతీష్ రెడ్ది వ్యవహారాల గురించి టి మీడియా పరిశీలన లో ఆయన దందాలు అనేకం బయట పడ్డాయి. 2000 సంవత్సరం లో నల్గొండ లో కేమిస్ట్రీ లో పీజీ చేసిన సతీష్ రెడ్ది 2015 అష్ట్ర జనరిక్స్ పేరుతో స్థాపించారు. దానితో పాటు మరో రెండు కంపెనిలు (2011లో,2023లో )రెండు కంపెనీలకు డైరెక్టర్లు గా నియామకం అయినట్లు చెప్పుకుంటున్నాడు. వాస్తవంగా ఇవి అన్ని డోల్ల కంపెనీలు గా తెలుస్తోంది. హైద్రాబాద్ లోని పారిశ్రామీక ప్రాతంలో ఉందని చెప్తున్న ల్యాబ్ లోనూ నఖిలీలు ఉన్నారనేది ఆయన వెబ్ సైట్ లో పొందుపరిచిన ఫోటోలు తెలియజేస్తున్నాయి. తన పరిశ్రమకు తానే ఏండి గా పేర్కొన్న ఇతను ఇండియా మార్ట్ లో మాత్రం క్రాంతి కుమార్ అనే వ్యక్తి ని కంపెనీ ఎండి గా చూపటంలోనే సతీష్ రెడ్ది మోసం తెలియచేస్తోంది. అనుమతి లేకుండ కనీస ప్రమాణాలు లేకుండ ఫార్మాటికల్ తయారు చేసి కేజీలు చొప్పున అమ్మకం చేస్తున్నాడు. క్యాన్సర్,ఎయిడ్స్ వ్యాధి నుండీ ఉపశమనం కోసం జనంలో ఉన్నవిశ్వాసం ఆసరా చేసుకొని మరికొందరితో కల్సి రెండు తెలుగు రాష్ట్రాలలో అక్రమాలకు తేర లేపాడు.

 

Also Read : తెలంగాణ ఉద్యమకారుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

ఎడాది కి రు 50 కోట్లు వరకు అతని వ్యాపార టర్నోవర్ అనేది అతని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ అక్రమాన్ని పసి గట్టిన అధికారులు గతం లోనే చర్యలు చెపట్టగా అప్పుడు అధికారంలో ఉన్న కొంతమంది పెద్దలు అడ్డు తగిలినట్లుగా తెలుస్తుంది. దీనితో ఎన్నికల ఫలితాలు వచ్చిన మరునాడు డిసెంబర్ 4న హైద్రాబాద్ లో దాడులు చేసి రు 4.50 కోట్లు విలువ చేసే నకిలి డ్రగ్స్ సీజ్ చేశారు. అప్పటికే స్థానిక నేతలు సహాకారం తో ఖమ్మం జిల్లా తల్లడ మండలం అన్నారు. గూడెం లో మరో అక్రమ దుకాణం తెరిచాడు. ఇక్కడ రు.3.50 కోట్లు విలువ చేసే నకిలి మందులు పట్టుబడ్డాయి.

అక్రమ మార్గంలో జిఎస్టి…
డోల్ల కంపెనీలకు అక్రమ మార్గంలో జిఎస్టీ లైసెన్సు కూడా పొందాడు. ఎగుమతి లైసెన్సు కూడా ఉంది అంటూ వ్యాపార పని మీద విదేశాలకు అంటూ చెప్పే ఆయన. ఇక్కడి బాగోతం బయట పడటంతో ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నట్లు సమాచారం. విదేశాల్లో ఉన్నాడు, కేసులు పెట్టాం అన్న అధికారులు లుక్ అవుట్ నోటిస్ జారీ గురించి మాట్లాడలేదు.. తదుపరి విచారణ వివరాలు తెలియవు.

Also Read : అంగన్వాడీల అక్రమ అరెస్ట్‌లు జగన్‌ నియంతృత్వానికి నిదర్శనం

 

అనుమానాలు ఇవిగో..
అనుమతి లేకుండ పరిశ్రమ నెల కొల్పి నకిలి మందులు తయారు చేస్తున్న వ్యక్తి గురించి ఆ శాఖ అధికారులు, రెవిన్యూ, పంచాయతీ, జిఎస్టి అధికారులు ఇప్పటి వరకు నోరు ఎందుకు మేదపడం లేదు. వారికి ముందే తెలిసి ముడుపులు తీసుకొన్నారా..? తల్లాడ ఎంపిపి దొడ్డ శ్రీను సొంత ఊరు అన్నారు గూడెం కావడం తోనే పంచాయతీ అధికారులు మాట్లాడటం లేదా అన్న అనుమానం ఉంది. హైద్రాబాద్ లో పట్టుబడిన అనంతరం అతని పై తీసుకొన్న చర్యలు ఏంటి.? పారిశ్రామిక ప్రాంతంలో ఆ ప్లాట్ ఎవరి పేరున ఉంది. అక్కడ తయారు చేసిన నఖిలి ఫార్మేటికల్ పౌడర్ తో ఇప్పటికె తయారు చేసిన మందులు విక్రయం చేసిన వారెవ్వరు అన్నది తెలియాలి. ఇటువంటి అనేక అనుమానాలు ఉన్నాయి. (మరికొన్ని వివరాలు మరో కదనం లో )

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube