ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న కేటుగాడి అరెస్ట్

ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న కేటుగాడి అరెస్ట్

1
TMedia (Telugu News) :

ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న కేటుగాడి అరెస్ట్
టీ మీడియా, మే 9, హైదరాబాద్: నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇప్పిస్తానంటూ వారిని మోసం చేస్తున్న కేటుగాడినిపోలీసులు అరెస్ట్ చేశారు. వంశీకృష్ణ అనే వ్యక్తి వందలాది మంది మహిళలను ఉద్యోగా పేరుతో మోసం చేస్తున్నాడు. ఆన్‌లైన్‌లో ఒంటరి మహిళలు, వితంతువులను టార్గెట్‌ చేసి వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని మభ్యపెడుతున్నట్టు పోలీసులు తెలిపారు. సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులువంశీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.

Also Read : ముంబైలో దావూద్‌ సహచరులపై ఎన్‌ఐఏ దాడులు

ఏపీ, తెలంగాణలో వంశీకృష్ణపై ఇప్పటికే 60 మంది మహిళల ఫిర్యాదు చేశారు. సంపాదించిన డబ్బుతోవంశీకృష్ణ బెట్టింగ్, గుర్రపు పందేలు ఆడుతున్నట్టు పోలీసులు గుర్గించారు. ఆరేళ్లలో బాధితుల నుంచి ఏకంగా రూ.3.5కోట్లు కాజేసినట్టు పోలీసులుతెలిపారు.ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ అకౌంట్లతో యువతులు, మహిళలకు వలవేస్తాడు.ప్రజాప్రతినిధులు పేర్లు ఉపయోగించి లక్షల రూపాయలు వసూళ్లు చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.2016 నుంచి 500 మందికిపైగా యువతులు, మహిళలను వంశీకృష్ణ మోసం చేసినట్టు పోలీసులు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube