బాంబు లేదు భయపెట్టారు

ఆర్ పి ఎఫ్ సి ఐ సంజీవరావు

2
TMedia (Telugu News) :

బాంబు లేదు భయపెట్టారు

ఆర్ పి ఎఫ్ సి ఐ సంజీవరావు

టి మీడియా, ఏప్రిల్ 14,కాజీపేట :రైలులో బాంబు పెట్టారని ఆగంతకుడు సమాచారం తో విశాఖపట్నం నుండి లోకమాన్య తిలక్ టెర్మినల్ వెళ్లే ఎల్టిటి రైలును కాజీపేటలో నిలిపివేశారు.సికింద్రాబాద్ కంట్రోల్/తెలంగాణకు సంబంధించి రైలు నంబర్ 18519 -ఎక్స్‌ప్రెస్‌లో బాంబు గురించి కాలర్ నుండి బుధవారం ఉదయం సమాచారం అందడంతో కాజీపేట ఆర్పిఎఫ్ సీఐ సంజీవరావు కాజీపేట జంక్షన్ లో ట్రైన్ ను నిలిపి వేసి డాగ్ స్క్వాడ్ సిబ్బంది తో సుందరంగా తనిఖీలు చేశారు. ప్రయాణికులను రైలు నుండి కిందికి దింపేసి వారి లగేజి లను జాగిలాల తో తనిఖీ చేశారు. ఆర్ పి ఎఫ్ సి ఐ సంజీవ రావు రైలు భోగి లోపల అనుమానం కలిగిన ప్రదేశాలను తన బృందంతో సుమారు మూడు గంటల పాటు ప్రతి భోగి లో తనిఖీలు చేపట్టారు.

Also Read : ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

ఈ తనిఖీల్లో ప్రయాణికుల సమాచారాన్ని మరియు వారి లగేజ్ లోను పరిశీలించారు. అనంతరం బాంబు కు సంబంధించి ఎలాంటి ఆనవాళ్ళు లేవని నిర్ధారించారు. ఈ సంఘటనతో ప్రయాణికులంతా భయభ్రాంతులకు లోనయ్యారు. అనంతరం రైలు కాజీపేట నుండి మూడు గంటలు ఆలస్యంగా సికింద్రాబాద్ కు బయలుదేరింది. ఈ సందర్భంగా సిఐ సంజీవ రావు మాట్లాడుతూ ఇది ఫేక్ కాల్ అని ఎవరో పనిగట్టుకొని ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. ఫోన్ కాల్ ఆధారంగా అతని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో. వరంగల్ బృందం డాగ్ స్క్వాడ్, సిబ్బంది హాజరయ్యారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube