నకిలీ నోట్ల దందాముఠా గుట్టురట్టు

నకిలీ నోట్ల దందాముఠా గుట్టురట్టు

1
TMedia (Telugu News) :

నకిలీ నోట్ల దందాముఠా గుట్టురట్టు

టీ మీడియా, మే 1,ఎన్టీఆర్ : జిల్లాలో నకిలీ నోట్ల దందా జోరుగా సాగుతున్నది. గత కొన్నాళ్లుగా నకిలీ నోట్లు ఎక్కడ పడితే అక్కడ వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు, దుకాణదారులు బెంబేలెత్తుతున్నారు. తాజాగా విసన్నపేట మండలం పుట్రేల వద్ద నకిలీ నోట్ల ముఠా పట్టుబట్టింది. వారి వాహనాలను తనిఖీ చేయగా 47 లక్షలకు పైగా విలువచేసే నకిలీ నోట్లు బయటపడ్డాయి. ఏసీపీ ప్రసాద్‌ మీడియాకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..
పుట్రేల వైపునకు వెళ్తున్న ఓ కారును పోలీసులు ఆపి తనిఖీ చేయగా.. రెండు బ్యాగులు బయటపడ్డాయి. వీటిని ఓపెన్‌ చేయగా కళ్లు బైర్లు కమ్మేలా డబ్బు కట్టలు బయటపడ్డాయి.

Also Read : రైల్వే స్టేష‌న్‌లో మ‌హిళ‌పై సామూహిక అత్యాచారం

తొలుత వాటిని చూస్తే అవి నకిలీవి అని ఎవరికీ అనుమానం రాలేదు. అయితే, పరిశీలించి చూడగా నకిలీవని తేలాయి. నిందితుల నుంచి 47.50 లక్షల విలువ చేసే నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుల రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మేకతోటి శశికిరణ్, గాలి రత్నం బాబు, పగిడిపల్లి గణేష్‌, తోట నరసింహారావులపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ ప్రసాద్‌ వెల్లడించారు. అలాగే, ఈ కేసుపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube