భారీగా దొంగనోట్ల పట్టివేత
-15 లక్షల రూపాయల దొంగనోట్లు స్వాధీనం
-5గురు అరెస్ట్..
– గుప్తనిధుల తవ్వకాలలో నష్ట పోవడం తో
టీ మీడియా; జూన్ 5; జగిత్యాల;జిల్లా కేంద్రంలో దొంగనోట్లు కలకలం సృష్టించాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో దొంగనోట్ల మార్పిడి జరుగుతుందని సమాచారం మేరకు జగిత్యాల టౌన్ సిఐ కిషోర్ ఆధ్వర్యంలో పోలీసులు దొంగ నోట్లు మార్పిడి చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు. టౌన్ సిఐ కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా దండ పల్లి గ్రామానికి చెందిన శేఖర్, జన్నారం కు చెందిన రాధాకిషన్, గోదావరిఖనికి చెందిన శ్రీనివాస్ గౌడ్, ఎల్కతుర్తి కి చెందిన శ్రీకాంత్ బిక్షపతి లు ఒక ముఠాగా ఏర్పడి గతంలో లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపగా నష్టపోవడంతో నష్టాన్ని పూడ్చుకునేందుకు దొంగ నోట్లను మార్పిడి చేసేందుకు సిద్ధపడి జగిత్యాల కొత్త బస్టాండ్ ప్రాంతంలో మార్పిడి చేస్తుండగా పక్కా సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద 15 లక్షల విలువ గల 500 రూపాయలవి దొంగ నోట్లు 3లక్షల ఒరిజినల్ నోట్లు పోలీసులు స్వాధీనం చేసుకొని వారి పై కేసు నమోదు చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube