నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్

నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్

0
TMedia (Telugu News) :

వినుకొండ:నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, బతికిఉన్న వ్యక్తి ని చనిపోయినట్లు చూపి విలువైన స్ధలం రిజిస్ట్రేషన్, కేసులో డాక్యుమెంట్ రైటర్ తో సహా మరో ముగ్గురు అరెస్టు.
పట్టణంలోని విష్ణుకుండినగర్ లో విలువైన 10 సెంట్ల భూమికి నకిలీ పత్రాలు సృష్టించి, బతికి ఉన్న వ్యక్తి ని చనిపోయినట్లు చూపించి అక్రమంగా రిజిస్ట్రేషన్స్ జరిగిన సంఘటన లో రిజిస్టర్ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు డాక్యుమెంట్ రైటర్ మతుకుమల్లి రామకృష్ణ, దావులూరి వెంకటేశ్వర్లు, ఘంటా బలరామ్, గడిపూడి విశ్వనాథం లను అరెస్టు చేసి కోర్టు కు హాజరు పరిచినట్లు తెలిపిన పోలీసులు.నుకొండ పోలీసు స్టేషన్ క్రైమ్.నెం. 337/2021 U/S 120(B), 404,405,406,420,467 R/W 34 IPC కేసులో ఫోర్జరీ డాకుమెంట్ సృష్టించి వేరే వారి స్థలమును రిజిస్టర్ చేసిన కేసులో వినుకొండ సబ్.రిజిస్టర్ యిచ్చిన రిపోర్టు మేరకు ముద్దాయిలు అయిన దావులూరి వెంకటేశ్వర్లు, గంటా బలరామకృష్ణ, మతుకుమల్లి రామకృష్ణ హనుమంతరావు, గడిపూడి విశ్వనాధం అను వారిని ఈ రోజు వినుకొండ పోలీసు వారు అరెస్టు చేసి రీమాండ్ కు పంపినాడు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube