జర్నలిజం కు నకిలీ మరక

వార్తలు వదిలేసి వసూళ్లు పర్వం

0
TMedia (Telugu News) :

  జర్నలిజంకు నకిలీ మరక

– వార్తలు వదిలేసి వసూళ్లు పర్వం

– సంఘాలు ,నేతలు గా చెలామణ

– ప్రెస్ మీట్స్ వద్ద వారిదే హావా

టీ మీడియా,జనవరి 20, ప్రత్యేక ప్రతినిధి : హెడ్డింగ్ ,డేట్ లైన్, లీడ్ అంటే ఏమిటో వారికి తెలియదు. సాయింత్రం 5 గంటల నుండి అసలైన జర్నలిస్ట్ వార్తలు తో కుస్తీ పడుతూ బిజీ గా ఉంటారు.జర్నలిస్ట్ ముసుగు వేసుకొన్న కొంత మంది అక్రమ కలక్షన్స్ బిజీ లోఉంటారు. అక్ర మాన్ని ప్రశ్నిస్తున్నము అనే విధంగా ఫోజు ఇస్తారు.వీరి లో కొంత మంది సంఘాలు, నేతలుగా చలామణి అవుతుండగా మరింకొందరు సీనియర్ జర్నలిస్టులుగా తమ కి తాముగా చెప్పు కొంటున్నరు.చేతి లో పుస్తకం,జేబులో పెన్ను లాంటి వి కూడా కనిపించని వీరి సంఖ్య ఒక్క ఖమ్మం నగరం లో నే 100 కు పైగా ఉన్నట్లు ఇటీవల ఉన్నత స్థాయి ప్రభుత్వ శాఖ పరిశీలన లో వెల్లడి అయినట్లు సమాచారం,రాష్ట్ర,జిల్లా వ్యాప్తంగా ఈ సంఖ్య వేలల్లో ఉన్నది అనేది టెలుస్తోంది..చిన్న ,చిన్న సమస్యలు చెప్పు కొనే వారీ తో పాటు వి ఐ పీ ల ప్రెస్ మీట్ ల వరకు ముందు వరుస లో వీరే ఉంటారు..

సంఘం ,నాయకులం

అక్రమ జర్నలిస్టులు లో కొంతమంది అడ్రస్ లేని పేపర్ లు కే కాదు, అడ్రస్ లేని ,కనీసం కార్యాలయం,, బోర్డ్ లు కూడా కనిపించని సంఘాలు కు నాయకులు గా చలా మని అవుతున్న దుస్థితి ఉంది. మాఫియా లాగా ఓక గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకోనీ చిరు వ్యాపారులును వదిలి పెట్టకుండ వసూలు వీరి పనిగా ఉంది.వీరిలో కొంత మంది అక్రమ మార్గం లో అక్రిడే షన్లు పొందిన వారు ఉన్నారు. వాహనం కు ప్రెస్ అని పెద్దక్షరాలు తో వేసుకొని తమ అక్రమ వ్యాపరానికి జర్నిలుస్ట్ ముద్ర నీ వినియో గించు కొంటున్నట్ల గా ఉన్నత స్థాయి పరిశీల న లో వెల్ల డి అయింది.

మాఫియా తరహాలో కలెక్షన్స్

జర్నలిస్ట్ ముసుగు గాళ్ళు దందా మాఫియా తరహాలో ఉన్నట్లు కూడా వెల్లడి అయింది.బడా మోసగాళ్ళు మించి వీరి కలెక్షన్స్ ఉన్నయి. ఇటీవల మాజి ప్రజా ప్రతినిధి ఓకరు ఖమ్మం లోతన పుట్టిన రోజు నాడు ఇచ్చిన యాడ్ లు కు సమధించిన బిల్లు లు స్వయంగా చెల్లించడానికి 20 మంది ని ప్రత్యేకంగ పిలిచారు. అందరి కి ఆయన చేతులు మీదుగా ఇచ్చారు. బిల్లు అందు కొన్న వారీ లో 8 మంది అసలు జర్నలిజం వృత్తి తో సమథం లేదు.మరో నలుగురు వృత్తి ముసు గు వేసుకొని సంఘం నేతలు గా చలామని అవుతున్న వారు ఉన్నారు.ఇంకో ముగ్గురు ఛానల్ పేరుతో కనీసం కార్యాలయం లేని షో మీడియా వారు ఉన్నారు.ప్రస్థుత ప్రజా ప్రతినిధి ఓకరు ఇటీ వల చేసిన చెల్లింపులు లోనూ అదే సీన్ రిపీట్ అయింది. ఆస్పత్రులు, మాల్స్ లాంటి వి ప్రారంబాలు సందర్భంగా,బారి సభలు, కార్యక్రమాలు ,ప్రెస్ మీట్ లు సందర్భం లోనూ సంఘాలు, మీడియా పేరుతో వసూళ్లు గురించి చెప్పాల్సిన పని లేదు.

Also Read : కేదార్‌నాథ్‌ ఆలయంపై మంచు దుప్పటి

ఐడి లో అగుపించని అడ్రస్

జర్నలిస్ట్ ముసుగు లో ఉన్న వీరి లో కొంత మంది ఐడి కార్డులు పై ,కార్డు హోల్డర్ కు చెందిన కార్యాలయం అడ్రస్ కూడా కనీ పించని పరిస్థితి ఉంది..ఇంకొంత మంది కి అసలు కార్డులు ఉండవు.వారు చెప్పే మీడియా సంస్థ అసలు ఎక్కడ ఉందో అసలు తెలియదు..జర్నలిజం పై వీరికి కనీస నాలెడ్జ్ ఉండదు..
గ్యాంగ్ వార్
అక్రమ జర్నలిస్టులు,సంఘాలు మధ్య గ్యాంగ్ వార్ లు జరుగుతున్న సందర్భాలు ఉన్నయి.మద్యం మత్తు లో వీరంగాలు చేస్తున్న పరిస్థితి ఉంది.ఇటువంటి సందర్భాల్లో అసలు ఎవరు,నకిలీ ఎవరు అనే విషయం నిర్దారణకు అధికారులు తల లు పట్టుకుంటున్నారు.ఏదైనా పత్రిక,ఛానల్,డిజిటల్ మీడియా లో అక్రమం గురించి వార్త వస్తె అక్కడ ఈ అక్రమ జర్నలిస్టులు వాలి పోతారు. వివరణ తో మొదలయ్యే వీరి వ్యవహారం అందినంత వసూలు తో ముగుస్తుంది.

అక్రమార్కులు వివరాలు తో నివేదిక

అక్రమ జర్నలిస్ట్ ల వివరాలు తో కూడిన నివేదిక లు ఎక్కడి కక్కడ సిద్దం అయినట్లు తెలిసింది. వీరి అక్రమాలు కు సమందించిన వివరాలు,నకిలీ ఐడి లు,సంఘాలు,నేతలు లాంటి వాటి తో పాటు,నివాసం,రోజు వారి పని,వినియోగించే ఫోన్ నెంబర్ లు,ఏ తరహ వసూళ్లు లాంటి వివరాలు తెలిపే ప్రత్యేక ఫార్మెట్ రూపొందించి తయారు చేసి నట్లు సమాచారం..అక్రమ జర్నలిస్టు సంఖ్య లో హైద్రాబాద్ మొదటిస్థానం లో ఉండగా, మిగిలిన జిల్లాలు తరువాతి స్థానం లో ఉన్నయి అనేది తెలుస్తంది.అక్రమార్కులు పై చర్యలు తీసుకుంటే తప్ప షోషల్ మీడియా ముసుగులో వికృత చేష్టలు అరికట్టటం సాధ్యం కాదు అనే అభిప్రాయం లో పాలనా యంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : వెలసిన ఖలిస్థానీ అనుకూల పోస్టర్లు

నకిలీ జర్నలిస్టుల కట్టడికి చర్యలు కోరుతూ ఎస్పీకి ఏ పీ వినతి

టీ మీడియా,తిరుపతి : మీడియా పేరుతో వేలాది వాహనాలకు స్టిక్కర్ అంటించుకుని చెలామణి అవుతున్న నకిలీ జర్నలిస్టులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్ ఫర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ( ఏ పీ జే యు) నాయకులు తిరుపతి ఎస్పీ కి వినతిపత్రం సమర్పించారు. సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఏపీ జే యు చిత్తూరు జిల్లా అధ్యక్షులు కోలా లక్ష్మీపతి, ఉపాధ్యక్షులు జీ. తిరుపాల్, సహాయ కార్యదర్శి తలారి లోకేశ్వర్, తదితరులు అధికారులను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ జారీచేసిన అక్రిడిటేషన్ కార్డులు కలిగిన జర్నలిస్టుల వాహనాలకు పోలీసులు నెంబర్ కలిగిన స్టిక్కర్లు మంజూరు చేయాలని సూచించారు. దీనిపై ఎస్పీ ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి స్పందిస్తూ తప్పనిసరిగా మీడియా పేరుతో అనధికార వ్యక్తులు తమ వాహనాలకు ప్రెస్ స్టిక్కర్లు అంటించి కొని తిరగడం పై రేపటి నుంచి కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. ఈ అంశంపై మంగళవారం ఉన్నతాధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్బంగా అయన తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube