పడిపోయిన ఉష్ణోగ్రతలు‌..

ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన ఐఎండీ

0
TMedia (Telugu News) :

పడిపోయిన ఉష్ణోగ్రతలు‌..

– ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన ఐఎండీ

టీ మీడియా, జనవరి 16, న్యూఢిల్లీ : ఉత్తర భారతదేశం గజగజ వణికిపోతోంది. గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పతనమవుతున్నాయి. నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు మరో కోల్డ్‌ స్పెల్‌ ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే వెల్లడించింది. మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. కాగా, సోమవారం ఉదయం ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 1.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. దీంతో ప్రజలు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజన్‌లో ఇంత తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో ఢిల్లీలో నేటి నుంచి మరో ఆరురోజులపాటు ఐఎండీ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. సోమవారం ఉదయం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల సెల్సియస్‌గా, లోధి రోడ్డులో 1.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. మరోవైపు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దట్టంగా అలముకొన్న పొగమంచు కారణంగా 13 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఇండియన్‌ రైల్వేస్‌ ప్రకటించింది. పలు విమానాలు సైతం ఆలస్యంగా నడుస్తున్నట్లు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు వెల్లడించారు.

Also Read : వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు..

రానున్న ఐదు రోజుల్లో ఢిల్లీ సహా పంజాబ్‌, హర్యాణా, చండీగఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ తదితర ప్రాంతాల్లో దట్టమైన మంచు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. వాయువ్య ప్రాంతం మీదుగా వీస్తున్న చలిగాలుల వల్ల జనవరి 18 వరకు ఆయా ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube