మావోయిస్ట్ చెరలో మాజీ సర్పంచ్.

0
TMedia (Telugu News) :

కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు.

టీ మీడియా, డిసెంబర్ 21, ఏటూరునాగారం

ములుగు జిల్లా వెంకటాపురం (నుగురు) మండలం సూరవీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కొర్సం రమేష్ ను మావోయిస్ట్ లు నిన్న కిడ్నాప్ చేసినట్లు రమేష్ భార్య కోర్సం రజిత తెలిపారు.రమేష్ భార్య కోర్శం రజిత మాట్లాడుతూ..తన భర్త 2014 లో వెంకటాపురం మండలం సూరవీడు గ్రామం సర్పంచ్ గా పనిచేశాడనీ,గత ఐదు సంవత్సరాలుగా ఏటూరు నాగారం లో రజిత ఏటూరు నాగారం సామాజి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎఫ్.ఎన్. ఓ గా పనిచేస్తుందని,నిన్న తన భర్త రమేష్ చర్ల కు వెళ్తున్నా నని చెప్పి ఇంట్లోనుంచి వెళ్లిపోయాడని,తిరిగి ఇంటికి రాక పోవడంతో తన బంధువులకు సమాచారం అందించామని, ఈ రోజు తమ బంధువులు రమేష్ ను మావోయిస్ట్ లు కిడ్నాప్ చేశారని తనకు తెలిపారని రజిత బోరున విలపించింది.తన భర్త మావోయిస్ట్ ల చెరలో ఉన్నాడని తెలిసి బోరున విలపస్తున్నది.తన భర్త ను మావోయిస్టులు ఎటువంటి హానీ తలపెట్టకుండా వదిలిపెట్టలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేసింది.తనకు ఇద్దరు పిల్లలున్నా రని ఆమె కన్నీరుమున్నీరు గా విలపిస్తుంది.

Ramesh’s wife Korsam Rajita said that Ramesh, a former sarpanch of Venkatapuram zone Mulugu district.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube