డాక్టర్ వైయస్ఆర్ పొలంబడి కార్యక్రమం

డాక్టర్ వైయస్ఆర్ పొలంబడి కార్యక్రమం

1
TMedia (Telugu News) :

డాక్టర్ వైయస్ఆర్ పొలంబడి కార్యక్రమం

టీ మీడియా, ఆగస్టు 05, మహానంది: మహానంది మండల పరిధిలోని తమ్మడపల్లె, బుక్కాపురం గ్రామాల్లో శుక్రవారం డాక్టర్ వైయస్ఆర్ పొలంబడి కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి బి. నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.1.ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా వనరుల కేంద్రం ఏడిఏ సి. సరలమ్మ మాట్లాడుతూ పొలంబడి కార్యక్రమం ద్వారా రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని సాధించే విధానాలను తెలుసుకోవచ్చన్నారు. 2.మండల వ్యవసాయ అధికారి, బి. నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ పొలంబడి యొక్క ముఖ్య ఉద్దేశ్యము రైతులు పంటలో ఒక సమస్య వచ్చినప్పుడు ఆ పంటను గమనించి విశ్లేషించి చర్చించి సరియైన నిర్ణయం తీసుకునే దిశగా రైతులలో నిర్ణయాత్మక శక్తిని పెంచడం. 3.రసాయనిక పురుగు మందులు విచక్షణ రహితముగా వాడుట ద్వారా కలిగే నష్టాల గురించి రైతులకు ఒక చార్ట్ ద్వారా వివరించారు. 4.రైతులు సుడోమోనాస్ ఫ్లోరోసెన్స్ అనే జీవ శిలీంద్ర నాసినితో విత్తన శుద్ధి చేసుకోవాలని అలాగే వరి నాటు సమయములో ఎకరాకు 20 కిలోలు ముడి జింకు వేసుకోవాలని తెలిపారు. 5.జింక్ సల్ఫేట్ ను భాస్వరం ఎరువులతో కలిపి వాడరాదు అని సూచించారు.

 

Also Read : ర‌క్షాబంధ‌న్ స్పెష‌ల్

 

6.ఉల్లికోడు తెగులు రాకుండా ముందు జాగ్రత్తగా నారుమడిలో కార్బో ఫ్యూరాన్ 3జి గుళికలు 160 గ్రాముల ఒక సెంటు నారుమడికి విత్తిన పది రోజులకు వేసుకోవాలి. నాటువేసిన వారం పది రోజుల తర్వాత ఎకరాకు 10 కిలోలు కార్బో ఫిరాన్ 3జి గుళికలు ముందు జాగ్రత్తగా వేసుకుంటే ఉల్లికోడు రాకుండా నివారించు కోవచ్చన్నారు.7.వరి నాటు సమయంలో నారు కొనలను తుంచి నాటుట ద్వారా కాండం తోలుచు పురుగును కొంతవరకునివారించుకోవచ్చు.
8.అలాగే నాటు సమయంలో వరి నారు వేర్లను క్లోరోపైరీఫాస్ ద్రావణంలో ముంచి నాటుకోవాలని రైతులకు తెలియజేశారు.9. రైతులు వరి పంటలో పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులను వాడరాదని సూచించారు.10.నారు నాటు సమయములో ఒక చదరపు మీటరుకు 33 కుదుళ్ళు ఉండే విధంగా చూసుకోవాలని తెలిపారు.అనంతరం మహానంది దేవస్థానం చైర్మన్ కొమ్మా మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ రైతులు ప్రతి పొలంబడి కి హాజరై వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల బిటీయమ్ ఉమామహేశ్వరి, తమ్మడపల్లి సర్పంచ్ సాలమ్మ , ఏఈఓ శ్రీనివాసరెడ్డి, అన్ని గ్రామాల ఆర్బికే సిబ్బంది, వి ఏ ఏ లు, వి హెచ్ ఏ లు, ఎంపీఈవోలు,పొలంబడి గ్రామ రైతులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube