కేసీఆర్ పాలనలో దగా పడ్డ రైతులు

మాజీ ఎమ్మెల్యే విజయరమణా రావు

1
TMedia (Telugu News) :

కేసీఆర్ పాలనలో దగా పడ్డ రైతులు
-మాజీ ఎమ్మెల్యే విజయరమణా రావు

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ

రైతుల పంటకు గిట్టుబాటు ధర

-వరంగల్ రైతు డిక్లరేషన్ కరపత్రాలు,గోడ ప్రతులను ఆవిష్కరణ
టి మీడియా,మే24, పెద్దపల్లి బ్యూరో:ప్రజల ఆకాంక్షలు అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని,కానీ ప్రస్తుత కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతులు దగా పడ్డారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు,పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు గారు పేర్కోన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులతో కసిలి విజయరమణా రావు కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ కరపత్రాలు,గోడ ప్రతులను ఆవిష్కరించారు.అనంతరం విజయరమణా రావు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ,ఇందిరమ్మ రైతు భరోసా,రైతులకు,కౌలు రైతులకు ప్రతి ఎకరాకు రూ.15 వేలు,ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు,రైతుల పంటకు గిట్టుబాటు ధర,ప్రతి గింజను కొంటామ‌న్నారు.ధరలు ముందే నిర్ణయించి,మూతబడిన చెరుకు ఫ్యాక్టరీలను తెరిపిస్తామ‌న్నారు.పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామ‌న్నారు.

 

Also Read : అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు ఆహ్వానం

 

మెరుగైన పంటల భీమాను తీసుకోస్తామ‌న్నారు.రైతు కూలీలకు,భూమిలేని రైతులకు భీమా ఉపాధి హామీ పథకానికి వ్యవసాయాన్ని అనుబంధం చేస్తామ‌న్నారు. ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామ‌ని,మెరుగైన రెవెన్యూ వ్యవస్థను తీసుకోస్తామ‌న్నారు.చివరి ఎకరా వరకు నీళ్లు అందిస్తామ‌న్నారు.రైతు సమస్యల శాశ్వత పరిష్కారానికి చట్ట పరమైన అధికారాలతో రైతు కమీషన్ ఏర్పాటు చేసి లాభసాటి వ్యవసాయమే లక్షంగా వ్యవసాయాన్ని పండగ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని అన్నారు.తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గమనించి రాహుల్ గాంధీ గారు వరంగల్ లో రైతు డిక్లరేషన్ ప్రకటించి రైతుల వెన్నుదట్టి రైతాంగానికి భరోసా కల్పించారని తెలిపారు.జాతీయ ఉపాధి హామీ పథకం,రైతులకు ఏకకాలంలో రుణమాఫీ,పండించిన పంటలకు గిట్టుబాటు ధరకు కొనుగొలు చేస్తూ ఇలా అనేక సంక్షేమ పథకాలు అందించిన కాంగ్రెస్ పార్టీనీ ప్రజలు ఆదరించాలని,అసమర్థ బీజేపీ టీఆర్ఎస్ పార్టీల పాలనకు చరమ గీతం పాడాలని కోరారు.వరంగల్ రైతు డిక్లరేషన్ ను గ్రామ గ్రామానికి తీసుకువెళ్లి రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టి శ్రేణులపై ఉందని విజయరమణారావు గారు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube